Home Cinema Ram Charan: తండ్రి కంటే రామ్ చరణ్ కి డబ్బే ముఖ్యమా.. వ్యాపారాల్లో నష్టం వస్తే...

Ram Charan: తండ్రి కంటే రామ్ చరణ్ కి డబ్బే ముఖ్యమా.. వ్యాపారాల్లో నష్టం వస్తే సహించడా.. మెగాస్టార్ తోనే గొడవ పడతాడా..?

Ram Charan MegaStar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. ఆయనకు ఆ బిరుదు ఎలా వచ్చింది అనే విషయం మెగా అభిమానులకు మాత్రమే తెలుసు, కానీ మిగిలిన సినీ ప్రేక్షకులకి కొద్ది మందికే తెలుసు.. ఐతే రామ్ చరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవి అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి యాక్టింగ్ స్టైల్ మరియు గుణ గణాలు కలిపి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టడంతో రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ అనే పేరుతో వచ్చింది. ఇక తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మధ్య ఎలాంటి అనుబంధం గురించి ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక మెగా కుటుంబం మొత్తంలో ఉండే ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రేమ ఆత్మీయ, అనురాగాలతో, అనుబంధాలతో కలిసి మెలిసి కలగలుపుకుని ఉంటారో ప్రతీ ఒక్క సినీ ప్రేక్షకులకి తెలుసు.

See also  Ram Charan : నాగబాబుని బూతులు తిట్టిన రామ్ చరణ్.. దానికి చిరంజీవి..

Mega Power Star Ram Charan

మెగా ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ ఒకే చోట కలిసి ఎంతో ఆనందంగా కలిసి మెలిసి సంతోషంగా ఓ పండుగ వాతావరణం ఏర్పడేలా చేసుకుంటారు. ఇక అలాంటి ఫోటోలు ఎన్నో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అవి వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అలాంటి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో సంచలమైన విషయంగా మారిపోయింది. మరి ఏంటా విషయం అనేది మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే.. మెగాస్టార్ చిరంజీవి కంటే రామ్ చరణ్ కి డబ్బే ఎక్కువ అట. చిరు నటించే సినిమాల్లో నష్టపోతే రామ్ చరణ్ మెగాస్టార్ పై కోప్పడతారు అంటూ ఓ ఆశ్చర్యకరమైన విషయమైతే ప్రస్తుతం సోషల్ మీడియా తిరుగుతూ వైరల్ గా మారింది.

See also  Hi Nanna Trailer Review : హాయ్ నాన్న ట్రైలర్ చూస్తే ఆ పాపులర్ సీరియల్ లో సీన్స్..

Mega Star Ram Charan

మరి ఏంటా సంగతి.. అసలు విషయం గురించి మనం చర్చించినట్లయితే.. చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చి మళ్లీ సినిమాల్లో హీరోగా నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 మనందరికీ తెలిసిందే.. ఇక ఈ చిత్రాన్ని మనమంతా కూడా చూసే ఉంటాం. ఈ చిత్రం యొక్క దర్శకుడు వి.వి వినాయక్  ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ రామ్ చరణ్ చిరంజీవి మధ్య ఎంతో మంచి ఆత్మీయమైన అనుబంధము ఉంటుంది. ఒక సారి చిరంజీవి గారికి జ్వరం వస్తే రామ్ చరణ్ గారు ఎంతో తల్లడిల్లిపోయారు. అప్పుడు ఆయనలో తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో బయటపడింది అంటూ తెలియజేశారు.

See also  Raj-Koti : రాజ్ - కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

Ram Charan

కాగా అందుకు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదు ఒక వేళ నాకు జ్వరం వస్తే సినిమాల విషయంలో డబ్బులు ఎక్కడ నష్టపోతామో అనే భాధ కచ్చితంగా వాడికి ఉంటుంది అని చెప్పారు. అలాంటిదేమీ లేదు చరణ్ (Ram Charan MegaStar) కు ఎంత ప్రేమ ఉంటుందో మాకు తెలుసు అని దర్శకుడు అంటే.. నీకేం తెలుసు సినిమా నష్టపోతే వాడు మళ్ళీ నా మీదకే కదా గొడవకి వస్తాడంటూ చిరంజీవి చెప్పాడు. ఐతే ఇది కేవలం సరదాగా ఆ క్షణం వరకు నవ్వుల పువ్వులు పూయించడానికి మాత్రమే మాట్లాడుతున్న మాటలు కాగా మనకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో మరొక్కసారి ఈ విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది.