Nagarjuna Venkatesh Fight: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ మరియు స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు దగ్గుబాటి వెంకటేష్.. ఇక ఆయన సినిమాలు అప్పట్లో సంచలనాలు సృష్టించేవి. ఏ సినిమా తీసిన సరే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచేది. దర్శక, నిర్మాతలు సైతం వెంకటేష్ తో ఎలాగైనా సినిమా తీయాలని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు.. అలా ఆయన సినిమాలు నటించిన వరుసగా హిట్ అవుతూ ఉండడంతో విక్టరీ అనే పేరు రావడంతో ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఓవరాల్ సినీ కెరియర్ చూసుకున్నట్లయితే దాదాపు 70% వరకు సక్సెస్ సాధించిన సినిమాలే ఉండడం విశేషం. అందువల్లే విక్టరీ ఆయన వశమై ఇంటి పేరుగా నిలిచింది.
కామెడీ నుండి మొదలుకొని యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో ఆయన జీవించేస్తుంటాడు. ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు పూర్తి న్యాయం కచ్చితంగా చేస్తుంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువే ఆయనకి.. విపరీతంగా ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకున్నాడు. అందులో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి కూడా లేనేలేదు. ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ రూమర్ అనేది లేకుండా వ్యక్తిగత జీవితంలో చాలా కూల్ గా ఉంటాడు వెంకటేష్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో తో సరే చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. అలాంటి విక్టరీ వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని సంచలమైన సీక్రెట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మనందరికీ తెలిసిందే.. దగ్గుపాటి కుటుంబానికి చెందిన లక్ష్మీని అక్కినేని నాగార్జున వివాహం చేసుకున్నాడు. తన చెల్లి కోసం వెంకటేష్ ఓ సమయంలో నాగార్జునతో గొడవకు సైతం వెళ్ళాడట. వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ దగ్గుపాటి అయితే అక్కినేని నాగార్జున మొదట ఏమైనా వివాహం చేసుకున్నాడు. ఇక ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొగల్ రామానాయుడు వీళ్లిద్దరికీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ కారణం చేతనే నాగార్జున కి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు రామానాయుడు. ఇక వీళ్లది పెద్దలకుదురుచిన వివాహం. కొద్ది రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు ఆ బాబు ఎవరో కాదు నాగ చైతన్య.
ఇక నాగ చైతన్య పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కలిసి ఉండలేక విడిపోవాలని నిశ్చయించుకొని విడాకులు తీసుకుని ఎవరికి వారు విడిపోయారు. కానీ వీళ్ళిద్దరిని కలపాలని అన్న విక్టరీ వెంకటేష్ ఎంతగానో ప్రయత్నించాడట. తన చెల్లెలి లక్ష్మికి కలవాలని ఉన్నప్పటికీ నాగార్జునకి మాత్రం అస్సలు ఇష్టం లేదట. ఆయన అప్పటికే హీరోయిన్ అమలతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ ఆగ్రహంతో (Nagarjuna Venkatesh Fight) నాగార్జున తో గొడవకు సైతం దిగాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలా కూల్ గా ఉండే వెంకటేష్ ఏకంగా అక్కినేని నాగార్జునతో గొడవకు దిగాడ అంటూ వెంకటేష్ అభిమానులు దగ్గుపాటి అభిమానులు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.