Ghattamaneni Mahesh Babu: హీరో కృష్ణ వారసునిగా ఆయన కుమారుడు ఘట్టమనేని మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఇక ఆయన అంటే తెలియని వారంటే ఉండరు. ఇక తన తొలి చిత్రం రాజకుమారుడుతో నినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు గా మారి మిల్క్ బాయ్ లా తన పేరును పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తరగాని అందంతో కుర్ర హీరో లాగా కనబడుతూ.. తన బాడీ లాంగ్వేజ్ లో ఫేస్ లో మార్పులు చేసుకుంటూ ప్రతి ఒక్క సినిమాకి ఒక్కోలా కనిపిస్తూ తన అభిమానులను కాక తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాడు. ఇక ఇటీవలే కాలంలో మహేష్ బాబు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో నేటిజన్లు మాత్రం నువ్వు అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇంత పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వార్త వినపడుతోంది. అది ఏంటంటే.. మహేష్ బాబు చాలా సోమరిపోతని ఏదైనా పని చేయాలంటే మాత్రం కూర్చున్న కుర్చీలో నుంచి లేవకుండా అన్ని తన దగ్గరికి రావాలంటూ అలా పనులు చేయించుకుంటారని లేనిపోని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే కాకుండా ఆయన నటించే ఏదైనా సినిమాల్లో ఇబ్బందిగా ఉంటే అసలు ఆ సీన్స్ చేయడానికి అసలు ఇష్టపడడట.. మరీ ముఖ్యంగా ఎండలో షూటింగ్ అంటే ఆయన చేయనని మరి చెబుతారట. ఇక పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన మహర్షి చిత్రంలో మహేష్ బాబు గేదెల దగ్గరికి వెళ్లే ఓ సీన్ ఉంటుంది.
అయితే ఈ సీన్ ని చిత్రీకరించేటప్పుడు బయట ఎండ బాగా ఉండటంతో మహేష్ బాబు నేను ఆ గేదెలతో ఎండలో వాటి దగ్గరికి వెళ్ళనని డైరెక్టర్ మొఖం మీదనే చెప్పడంతో పైడిపల్లి వంశీ చేసేదేం లేక ఓ పెద్ద షెడ్డు వేయించి అది ఏసీ రూముగా మార్చి అందులో గేదెల షెడ్డు వేయించాడట. ఇక ఆ తర్వాత ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియకుండానే చాలామంది మహేష్ బాబు అంటే పడని వాళ్ళు ఆయన్ను మరి.. అంత సోమరిపోతా ఒకసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తది మనిషి పడే కష్టం విలువ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదే కాకుండా కేవలం ఎండకే అంత భయపడితే ప్రతి రోజు ఎండలో పనిచేసే కూలీలు ఎలా ఉంటారు మీకు తెలుసా? అంటూ.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రకరకాల కామెంట్లు మహేష్ బాబు (Ghattamaneni Mahesh Babu) పై విమర్శనాత్మకంగా పెడుతున్నారు. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం ఎవరో ఒకరు వైరల్ చేసిన వార్తను మీరు నమ్మడం నిజంగా మీ పనికిమాలిన తనమే. ఎందుకంటే.. మహేష్ బాబు గురించి తెలియకుండా మీరు ఇలా మాట్లాడడం తప్పు. ఇప్పటికే ఆయన ఎన్నో చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు డూప్ లేకుండా నటించి చాలా సార్లు హాస్పిటల్ పాలయ్యాడు. అలాంటి మహేష్ బాబు పై లేని పోనీ ప్రచారాలు చేయడం మీకు తగదు అని ఆయన అభిమానులు నేటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.