Allu Arjun: తెలుగు చిత్రం పరిశ్రమలో స్టైలిష్ స్టార్ హీరోగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని తన పేరుని ఏ రేంజ్ లో ఇక్కడ పదిలం చేసుకున్నాడో ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఆయన ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సీనియర్ హీరోలు సైతం తీసుకోలేని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అల్లు అర్జున్.. ఒక్కో సినిమాకి దాదాపు 100 కోట్ల వరకు చార్జ్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ను పదిలం చేసుకొని ఒకానొకప్పుడు సౌత్ ఇండియా కొద్ది మందికి మాత్రమే స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తనేంటో నిరూపించుకున్నాడు. (Allu Arjun Film)
ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో మరొక సారి సంచలనాలు క్రియేట్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ రికార్డులన్నీ తిరగరాసి గ్లోబల్ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం అయిపోగానే వెంటనే ఇద్దరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చిత్రాలు చేయడానికి లైన్లో పెట్టినట్లు మనకు అందిన సమాచారం.. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ.. అయితే ఇటీవల అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త అయితే వైరల్ గా మారి ప్రస్తుతం హాట్ టాపిక్ గా తెగ ట్రెండింగ్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ హిట్ ఇవ్వడానికి ఏకంగా తన లైఫ్ ను రిస్క్ లో పెట్టబోతున్నాడు అంటూ ఓ వార్త అయితే సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారి దూకుడుని ప్రదర్శిస్తుంది.
ఇక మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలేం చేయబోతున్నాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజా హెగ్డే. పూజా హెగ్డే కి మంచి లైఫ్ ఇచ్చింది నిజానికి అల్లు అర్జున్ మాత్రమే.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు ఐనప్పటికీ.. ఇంత మంచి అందం ఉండి, ఫిజిక్ మైంటైన్ చేస్తున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం అనుకున్నంత స్థాయిలో హిట్స్ లభించకుండా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసుకుని డిజాస్టర్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్నది పూజా హెగ్డే. కాగా.. పూజా హెగ్డే కి ద్వారా దువ్వాడ జగన్నాథం అనే చిత్రంతో బ్రేక్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమాతో ఆమె కెరియర్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు. అంత వరకు బానే ఉంది.
కానీ.. ఆ తర్వాత కూడా మళ్లీ వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. దాంతో దారుణమైన ట్రోలింగ్ కు నిత్యం గురవుతూనే ఉంది పూజ. ఇక ఇదే క్రమంలో ఆమెకి మరొకసారి లైఫ్ ఇవ్వడానికి తన తదుపరి చిత్రంలో అవకాశం కల్పిస్తున్నాడట (Allu Arjun Film) అల్లు అర్జున్. ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు ఏంటి ఐరన్ లెగ్ హీరోయిన్ ని సినిమాలో పెట్టుకోవడం ఏంటని ఆయన అభిమానులు తెగ కోపగించుకుంటున్నారట.. ఎందుకు నీ లైఫ్ నీ రిస్క్ లో పెట్టుకొని ఆమెకి హిట్ ఇవ్వడం కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అంటూ తెగ మండి పడిపోతున్నారట. తేడా కొడితే పరువు గంగలో కలిసిపోవడం ఖాయమంటున్నారు నెటీజన్లు. ప్రస్తుతం అయితే ఈ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది