Akhil Akkineni Marriage: సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ ఈ మధ్యకాలంలో కొంతమంది బడుద్దాయిలు ఎవరిమీద పడితే వాళ్ళ పై ఇట్టే ట్రోలింగ్ కు గురి చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ వరుసలో ట్రోల్ కి గురి అవుతూ ముందు ఉంది అక్కినేని కుటుంబం. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ ట్రోలింగ్ మరి ఇంత దారుణంగా మాడానికి కారణం అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన అప్పటినుంచి అక్కినేని కుటుంబం పై తెగ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో అఖిల్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే మరొకసారి సోషల్ మీడియాలో అఖిల్ పెళ్లి విషయంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎందుకంటే దానికి ప్రధాన కారణం అఖిల్ ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉండడం వల్ల ట్రోలింగ్ కు గురవుతున్నారని అర్థమవుతుంది. గతంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు.. అఖిల్ ఓ అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తీరా పెళ్లి సమయానికి వద్దనుకొని బ్రేక్ అప్ చెప్పుకున్నాడు. దాని తర్వాత పెళ్లి అనే ఆలోచనకే చాలా దూరంగా ఉంటున్నాడు అఖిల్.. కాగా ఇదే క్రమంలో నాగచైతన్య కూడా సమంతకు విడాకులు ఇచ్చేసి అక్కినేని ఇంటికి కోడలనే ఓ దిక్కు లేకుండా చేసేసారు. అయితే ప్రస్తుతం అక్కినేని అభిమానులు మాత్రం ఇంటికి కొత్త కోడలు వస్తే బాగుందని కచ్చితంగా రావాలని అప్పుడే అక్కినేని ఇంటికి పూర్వ వైభవం వస్తుందని కామెంట్ చేస్తున్నారు.
అలా అక్కినేని కుటుంబం పై ట్రోల్స్ సాగుతున్న తరుణంలో అఖిల్ (Akhil Akkineni Marriage) త్వరలోనే ఒక స్టార్ కూతుర్ని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వ్యాపించాయి. అయితే ఆ స్టార్ డాటర్ ఇప్పటికే పెళ్లి చేసుకొని మొగుడికి విడాకులు ఇచ్చేసిందంటూ తెలుస్తుందట.. ఇకపోతే మొదటి నుండే ఆ స్టార్ హీరోకు నాగార్జునకు మధ్య ఎంతో క్లోజ్ నెస్ ఉండేదని.. వీరిద్దరూ ఎన్నో సినిమాలకి ప్రమోషన్స్ చేసుకుంటారని.. కానీ పెళ్లి సమయంలో మాత్రం విధి ఆడిన ఓ వింత నాటకంలో వీళ్ళిద్దరూ వేర్వేరు వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అయితే అఖిల్ వివాహం చేసుకోకుండానే బ్రేకప్ చెప్పేస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ప్రస్తుతం విడాకులు తీసుకున్నదట..
ఇక సోషల్ మీడియాలో ఒకటే ఈ వార్త జోరందుకుంది. ఈ జంట మళ్ళీ ఒకటి కాబోతుంది అంటూ.. ఇదే క్రమంలో అక్కినేని నాగార్జునను అక్కినేని ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. అసలే ఓ సారి విడాకులు ఇచ్చి అక్కినేని పరువు అంతా మంటలు కలిపావు. మళ్లీ డివోర్స్ ఇచ్చిన అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుంటావా.? అసలు ఏమైంది మీకు.? అంటూ అభిమానులంతా ఘాటుగా స్పందిస్తున్నారు. దాంతో మరొక్కసారి అక్కినేని నాగార్జున పేరు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతుంది. అసలు ఈ మధ్య కారణం ఏంటో తెలియకుండానే అక్కినేని కుర్రాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉర్రూతలుగుతున్నాయి.. కానీ ఎక్కడ చూసినప్పటికీ వీళ్ళపై పాజిటివిటీ కంటే నెగటివ్ గానే ఎక్కువ మంది స్పందిస్తుండడం గానార్థం.. మరి ఇప్పటికైనా దీనిపై అఖిల్ ఏ విధంగా స్పందిస్తాడో చూద్దాం..