Home Cinema Genelia : నటి జెనీలియా ప్రెగ్నెంట్.. మూడవసారి తల్లి కాబోతున్న హీరోయిన్..

Genelia : నటి జెనీలియా ప్రెగ్నెంట్.. మూడవసారి తల్లి కాబోతున్న హీరోయిన్..

Genelia : తెలుగు మరియు తమిళ భాషలతో పాటుగా బాలీవుడ్ లో కూడా స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు జెనీలియా. ఈమె తొలిసినిమా బాలీవుడ్ తోనే ప్రారంభం అయ్యింది. అక్కడ పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఆ తర్వాత తెలుగు లో సుమంత్ హీరో గా నటించిన ‘సత్యం’ సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే(Genelia Pregnant). ఆ తర్వాత ఈమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్లింది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువే, ముఖ్యంగా ఈమె హీరోయిన్ గా నటించిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.

See also  Anushka : అనుష్క అసలు విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి?

actress-genelia

ఈ సినిమా కి ఈమెకి రాని అవార్డు అంటూ లేదు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ కూడా భారీ హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా అన్నీ భాషల్లో దుమ్ము లేచిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్స్ ని కొట్టిన పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా జెనీలియా నిల్చింది అని చెప్పొచ్చు. ఇక ఈమె బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కొడుకు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తన భర్త రితేష్ తో కలిసి ఆమె చేసిన లేటెస్ట్ చిత్రం ‘వేద్’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

See also  Kalyani: హీరోయిన్ కళ్యాణీ కాపురం కూలిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోతో ఎఫైర్ ఆ..?

ritesh-deshmukh-genelia

ఈ సినిమా తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మజిలీ’ చిత్రానికి రీమేక్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే జెనీలియా మరియు రితేష్ దేశముఖ్ కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో జెనీలియా బేబీ బంప్ తో కనిపించడం అందరిని షాక్ కి గురి చేసింది(Genelia Pregnant). అంటే ఆమె మూడవ సారి తల్లి కాబోతుంది అన్నమాట. ఇంస్టాగ్రామ్ లో ప్రతీ విషయాన్నీ అభిమానులతో పంచుకునే జెనీలియా, ఈ విషయాన్నీ మాత్రం ఎందుకు దాచిపెట్టిందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇకపోతే జెనీలియా టాలీవుడ్ లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట.

See also  Niharika : అప్పుడు నిహారిక కోరుకున్న నాగ చైతన్యతో వద్దన్న నాగబాబు ఇప్పుడేమంటాడో?

genelia-family

మంచి పాత్రల కోసం ఎదురు చూస్తుందట, కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రని ఇచ్చిన చెయ్యడానికి సిద్ధం అంటుంది ఈ హాట్ బ్యూటీ. చాలా మంది హీరోయిన్ లు తెలుగు లో అవకాశాలు లేక మధ్యలో మాయం ఐపోయారు. తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి వారిలో ఒకరు. కానీ వీరు అందరూ మెల్లిగా సినిమా ఛాన్స్ కొట్టి హిట్ కొట్టి మల్లి ట్రాక్ లోకి వచ్చేసారు. అలానే మరి జెనీలియా కూడా మంచి సినిమా తో హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందా లేదా అనేది వేచి చూడాలి. కానీ తిను తిరిగి వస్తే కచ్చితంగా అదరకొడుతుంది అని చెప్పొచ్చు.