Manchu Brothers Fight: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి క్రమశిక్షణతో కూడిన మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇకపోతే మోహన్ బాబు ఇద్దరు కొడుకులు సినిమాల పరంగా ఎంతవరకు పెద్దగా సక్సెస్ అయ్యారు అనే విషయం పక్కకు పెడితే.. తన తండ్రి నుంచి క్రమ శిక్షణ విషయంలో మట్టుకు ఎంతో నేర్చుకున్నారని.. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు వినిపించినటువంటి విషయాలు. మోహన్ బాబు ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఆయన అభిమానులు మాత్రమే కాక.. తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యేలా ప్రస్తుతం ఒక వీడియో బయటపడింది. ఆ వీడియో ఏంటంటే అందులో మంచు విష్ణు అలాగే మోహన్ బాబు ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి రచ్చ చేస్తూ గొడవ పడుతూ ఉండడం.. మోహన్ బాబు సన్నిహితంగా ఉండే వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మంచు విష్ణు ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు..
ఆ సన్నివేశాలని స్వయంగా మనోజ్ వీడియో తీస్తూ ఇలా మా బంధువుల ను కొట్టడానికి వస్తూ ఉంటాడని చెప్పడం.. పెద్ద కలకలమే రేపింది. అయితే ఆ వీడియోను స్వయంగా సోషల్ మీడియా వేదికలో మంచు మనోజ్ పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అయింది. వెంటనే హుటా హుటిన స్పందించిన మోహన్ బాబు మనోజ్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఆ వీడియోను డిలీట్ చేయించాలన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు మోహన్ బాబు అంటే పేరుకే అర్థం క్రమశిక్షణ అని.. అయితే ఆయన వారసులుగా పేరు తెచ్చుకున్న మంచు వారసులు అన్నదమ్ముల్లు మాత్రం ఇప్పటివరకు బయట కనిపించకుండా ఇంటర్నల్ గా ఎలా ఉన్నప్పటికీ..! ఏనాడు రోడ్డుకి ఎక్కలేదు.? మరి వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఎందుకు ఇలా చెడిపోయింది. అసలు ఈ గొడవలు (Manchu Brothers Fight) అన్నిటికీ కారణం ఏదన్నది.. దానిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దుమారమే లేస్తుంది.
ఇక మనోజ్ కొన్ని రోజుల క్రితమే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లోని రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. మంచు మనోజ్ కి అలాగే భూమా మౌనిక రెడ్డికి వీళ్ళిద్దరికీ ఇది రెండో వివాహం. వీరి ఇరు కుటుంబాలకి కాకుండా వీరిద్దరి మధ్య కూడా పాత పరిచయం ఉంది. వీళ్లిద్దరు చేసుకున్న మొదటి వివాహం ఇద్దరికీ కలిసి రాలేదు. ఇదే క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఉన్న పాత స్నేహం చిగురించి కొత్త ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరి కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకునే వరకు వెళ్ళింది వీళ్ళ బంధం.. వీళ్ళు దాదాపు మూడు సంవత్సరాల నుండి ప్రేమలో మునిగి తేలుతున్నారట.. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే మౌనికకు తొలి వివాహం గణేష్ రెడ్డితో జరగడంమే కాకుండా ఓ కొడుకు కూడా జన్మించాడు. అయితే మరొక వ్యక్తికి జన్మించిన బాబు ఉన్న మౌనికను ఎలా పెళ్లి చేసుకుంటావని మంచు ఫ్యామిలీ మనోజ్ ను ఎన్నోసార్లు నిలదీసినట్టు కూడా సినీ పరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతూనే ఉంది.
మొదటి భర్త గణేష్ రెడ్డి-మౌనిక రెడ్డికి జన్మించిన కొడుకు మంచు ఫ్యామిలీకి వారసుడికి ఎలా అవుతాడు అన్నదే వీరి ప్రశ్న.?? కానీ మంచు మనోజ్ మాత్రం తనకు అలాంటివి పట్టింపులు లేవని.. మౌనికను నేను ఎంతో ఇష్టపడ్డానని.. ఆమె కూడా అంతే నన్ను నమ్మింది.. అని చాలా గట్టిగానే తండ్రి మోహన్ బాబుకు, అన్న విష్ణు కి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇక మనోజ్-మౌనిక రెడ్డి వివాహం అయ్యాక మౌనిక కొడుకు కూడా తనకు వారసుడని చెప్పకనే చెప్పేశాడు. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మనోజ్ వచ్చి డాడీ నేను మౌనికనే వివాహం చేసుకుంటానని.. ఒకసారి ఆలోచించుకో అన్నాను అని.. అయినా లేదు డాడీ నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో మోహన్ బాబు ఇక మనోజ్ ఇష్టానికే వదిలేసాను అని చెప్పారు. ఏదిఏమైనాప్పటికీ మనోజ్ చేసుకున్న రెండో వివాహం ఇటు మోహన్ బాబుకు, అటు విష్ణుకు ఇష్టం లేదని ఆ కారణం చేతనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చిందని అదే గొడవ కారణమైంది అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో మంచి కుటుంబానికి తెలియాలి..