IND vs AUS : లండన్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిక్యం, పై చేయిలో ఉంది. భారత్ కి ఓటమి ఎంతో దూరంలో లేదు. ఆస్ట్రేలియా తన ( India vs Australia world test ) మొదటి ఇనింగ్స్ లో 469 భారీ స్కోర్ సాధించింది. స్మిత్ 121, ట్రావిస్ హెడ్ 163 భారీ శతకాలు చేయడంతోపాటు ఆసీస్ బ్యాట్స్ మాన్స్ అందరూ తల చేయి వేయడంతో ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ని శాసించే పరిస్థితికి వచ్చింది. టీం ఇండియా లో కూడా చెప్పుకోదగ్గ బ్యాట్స్ మాన్స్ ఉండటంతో ఇండియా కూడా ధీటైన జవాబు ఇస్తుందని అభిమానులు ఆశించారు.
హిట్ మాన్ రోహిత్, కింగ్ కోహ్లీ, మిస్టర్ డిపండబల్ పూజారా, అరవీర భయంకర ఫామ్ లో ఉన్న గిల్ తో పాటు రహానే లాంటి నాణ్యమైన బ్యాట్స్ మాన్స్ ఇండియా సొంతం.. వీళ్లతో పాటు జడేజా, శార్దూల్ ఠాకూర్ లాంటి నికార్సైన అల్ రౌండర్స్ కూడా భారత్ బాటింగ్ లైనప్ ని మరెంత బలోపేతం చేసింది. కానీ ఆస్ట్రేలియా మొదటి ( India vs Australia world test ) ఇనింగ్స్ అయ్యాక ఇండియా తన మొదటి ఇనింగ్స్ లో కేవలం 296 పరుగులు మాత్రమే చేసింది.. ఇండియా ప్రధాన బ్యాట్స్ మాన్స్ అయినటువంటి కోహ్లీ, పూజారా ని ఆస్ట్రేలియా బౌలర్స్ ఔట్ చేయడానికి బాల్ టాపింగ్ చేశారని పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఆరోపించడం ఇప్పుడు కలకలం రేగింది.
తన యూట్యూబ్ చానల్ లో మాట్లాడుతూ 16, 18 ఓవర్లలో బాల్ టాంపరింగ్ చేయడం క్లియర్ గా కనిపించిందని బాసత్ ఆలీ వివరించాడు. తన దగ్గర ఆసీస్ టాంపరింగ్ చేసిన ఆధారాలు నాదగ్గర ఉన్నాయని తను చెప్పడమే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్తున్నాడు. ఆస్ట్రేలియా ( India vs Australia world test ) ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో బాల్ టాంపరింగ్ చేస్తూ అడ్డగం దొరికిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాక్ మాజీ ఆటగాడు చూపించే ఆధారాల ప్రకారం పూజారా 14 ఓవర్లో , కోహ్లీ 19వ ఓవర్ లో ఔట్ అవడం తన వాదనకు, ఆధారాలకి మరెంత బలం చేకూరుతుంది.
ఒకవేల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ఉద్దంతాన్ని సీరియస్ గా తెసుకుని, ఆసీస్ చేసిన తొండి ఆట మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ విన్నర్ గా ఇండియాను ప్రకటించే అవకాశం లేకపోలేదని క్రికెట్ నిపుణులు గంటా పదంగా చెబుతున్నారు. ఏం జరుగుతోంది చూడాలి.