Naga Chaitanya : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరనుంచి ఏ వార్త ఎటువైపు ఎలా వెళ్తుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. దానివలన కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు ఉంటున్నాయి. ఏదేమైనా సినిమా వాళ్లకి ( Naga Chaitanya Samantha and Niharika ) సోషల్ మీడియా చాలా ప్లస్ అనే అనుకోవాలి. మంచిగానో, చెడుగానో వాళ్ళ గురించి అభిమానులు ఏదో రకంగా అంతా కలిసి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఇదంతా ఫ్రీ ప్రమోషన్ అనే అనుకోవాలి. వాళ్ల గురించి, వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే క్రమంలో.. వాళ్ళు ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే.. ఒక్కొక్కసారి కొన్ని అర్థం పర్ధం లేని వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి.
నాగచైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా పెద్ద స్టార్ డం ను తెచ్చుకోలేకపోయాడు. అయినా కూడా ఎక్కడా కూడా తీసిపోయేటట్టు కాకుండా.. నాగచైతన్య సినిమా అంటే మినిమం యావరేజ్ ( Naga Chaitanya Samantha and Niharika ) హీరోగా బానే సెటిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య మరొక ప్రయోగం మొదటిసారిగా చేస్తున్నాడు. నాగచైతన్య వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ గాని సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో నాగచైతన్యకి మంచి నేమ్ వస్తుంది. అయితే ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్న వెబ్ సిరీస్ పేరు దూత. విక్రం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో వస్తుంది.
వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి డేట్ దగ్గరికి వస్తున్న కొద్ది నాగచైతన్య దీనిపై ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా నాగచైతన్య ఒక వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. అందులో నిహారికతో నాగచైతన్య మాట్లాడుతూ ఉంటాడు. నిహారికతో దూత వెబ్ సిరీస్ గురించి చెప్తూ ఉండగా.. ఆమె ( Naga Chaitanya Samantha and Niharika ) నాగచైతన్యను ఇరిటేట్ చేస్తుంది. ఇక ఇరిటేట్ అయిపోయిన నాగచైతన్య టంగ్ స్లిప్పయి.. ” మీకు ఏ మాట వినే ఓపిక లేదు కాబట్టే నీ లైఫ్ లో ఎవరూ లేరు” అంటూ గట్టిగా అంటాడు. దానితో ఆమె ముఖం మాడ్చుకుంటుంది. అప్పుడు నాగచైతన్య సారీ చెప్పి.. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మాటల్లో మళ్లీ ఒకరి మీద ఒకరు కోపం వచ్చి విడిపోయి వెళ్ళిపోతూ డిసెంబర్ ఒకటో తేదీని దూత చూడండి అని చెప్పి వెళ్లిపోతారు.
ఇదంతా ఒక ప్రమోషన్ కోసం చేసిన వీడియో. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి నాగచైతన్య అంత మాట సమంతనే అన్నాడని.. నీకు ఏమాత్రం ఎదుటి వాళ్ళు చెప్పేది వినే ఓపిక లేదు, అందుకే నీకు ఎవరు లేకుండా పోయారు అని సమంతనే అంత మాట అన్నాడని కొందరు అంటుంటే.. నాగచైతన్య మాట్లాడుతున్న అమ్మాయి పేరుని నిహారిక అంటూ నిహారికని అంటున్నాడని.. నిహారిక కూడా ఎవరి మాట వినదు కాబట్టే భర్తని వదిలేసిందని అన్నాడని మరికొందరు అంటున్నారు. అసలు నిజానికి నాగచైతన్య వీళ్ళు ఇద్దరిని అనలేదు. తన ప్రమోషన్ ఎదో తాను చేసుకున్నాడు. దాన్ని ఎదో వేరే కోణంలో చూసి.. నెటిజనులు సరదాగా కామెంట్స్ చేష్టున్నారు. ఏదేమైనా దూత వెబ్ సీరియస్ అయితే మాత్రం వీళ్ళి ముగ్గురు పేర్లు వలన బాగా ప్రమోషన్ అయితే జరుగుతుంది.