Devil : ప్రతి కుటుంబంలోను ఎవరో ఒకరి మధ్య ఏదో ఒక రకమైన మనస్పర్థలు అనేది ఉండడం చాలా సహజం. అదే సెలబ్రిటీ కుటుంబాల్లో ఏదైనా మనస్పర్ధలు ఉంటే దాని గురించి అందరూ తప్పకుండా మాట్లాడుకుంటారు. తెలుగు సినిమా ( In the Devil movie Kalyan Ram dialogue ) ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా అగ్రస్థానాన్ని చేత పట్టుకొని ఉన్న కుటుంబం నందమూరి కుటుంబం . నందమూరి కుటుంబంలో వాళ్ళు ఏం చేసినా కూడా నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టం. ఆనందం వాళ్ళని సినిమాల పరంగా గాని రాజకీయపరంగా గాని అందరూ ఆదరిస్తూనే వచ్చారు.
అయితే నందమూరి కుటుంబాలు కూడా విభేదాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణకి, హరికృష్ణ పిల్లలకి పడదని కొంతమంది అనేక వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు ( In the Devil movie Kalyan Ram dialogue ) తీసుకున్నట్టు అనిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ సినిమా ట్రైలర్ బుధవారం నాడు విడుదలైంది. ఈ ట్రైలర్ లో కొన్ని మాటలు అందరికీ అలా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఈవెంట్లో కళ్యాణ్‌రామ్ తన మాటలను భావోద్వేకంగా మాట్లాడడమే కాకుండా.. తమ్ముడు ఎన్టీఆర్ దేవర సినిమా అద్భుతంగా తయారవుతుందని, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
అలాగే స్పీచ్ అయిపోయిన చివర్లో జై ఎన్టీఆర్, జై హరికృష్ణ అంటూ ప్రసంగాన్ని ముగించేసాడు. ఎక్కడ కూడా బాబాయ్ బాలకృష్ణ గురించి అసలు హరికృష్ణ మాట్లాడలేదు. దీనికి తోడు డెవిల్ సినిమా ట్రైలర్ లో చివర్లో వచ్చే ఒక డైలాగ్ బాలకృష్ణ ని ఉద్దేశించే చెప్పాడని టాక్ వస్తుంది. విశ్వాసంతో ఉండటానికి, విధేయతతో ఉండడానికి నేను ఏమైనా కుక్కను అనుకుంటున్నావా ? లయన్ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చంద్రబాబు నాయుడు ( In the Devil movie Kalyan Ram dialogue ) అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని.. ఆయన మీద అనేక మాటలు చాలామంది అన్నారు. పైగా దానిపై మీడియా వాళ్ళు బాలకృష్ణ ని అడిగినప్పుడు.. బ్రో ఐ డోంట్ కేర్ అని సమాధానం ఇచ్చారు. దానికి కౌంటర్ గానే విశ్వాసంతో ఉండడానికి విధేయత ఉండడానికి నేను ఏమైనా కుక్కను అనుకుంటున్నావా లయన్ అనే డైలాగ్‌ను బాబాయ్‌కు జవాబు ఇచ్చారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
హరికృష్ణ పిల్లలుకి బాలకృష్ణతో అంతగా పడటం లేదని టాక్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉండేది. అలాగే తారకరత్న మరణం తర్వాత కూడా జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను చూసి చూడనట్టుగానే బాలకృష్ణ వెళ్లిపోయాడని కూడా వార్త వచ్చింది. ఇలా నెటిజనులు ఎవరికి వాళ్ళు.. వాళ్ళ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ లో వచ్చిన డైలాగ్ ని.. ఎన్టీఆర్ తరఫున బాలకృష్ణ కు కౌంటర్ అని కొందరు నెటిజనులు అంటున్నారు. ఇదిలా ఉంటే డెవిల్ సినిమాపై ట్రైలర్ చూసిన తర్వాత నందమూరి అభిమానులకు ఇంకా అంచనాలు పెరిగాయి. కళ్యాణ్ రామ్ ఇటీవల సెలక్ట్ చేసుకున్న కథలు నటించే తీరు చాలా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.