Nellore MCA student: తల్లిని మించిన దైవం లేదని అంటారు. ఎందుకంటే మనకు ఏ సమస్య వచ్చినా వెంటనే వినడానికి, కాపాడ్డానికి ఆ దేవుడు అందరితో ఉండలేడు కాబట్టి.. అంత గొప్ప ప్రేమ, మనసు ఉన్న అమ్మని సృష్టించాడు. ఎవ్వరి నుంచి అయినా, తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. బిడ్డని కాపాడే తల్లే బిడ్డని చంపుతాదా అంటే అవుననే సమాధానాన్ని వినడం కూడా బాధగానే ఉంటాది. కలికాలం కాబట్టి ఇలా ( In Nellore one mother killed her daughter for her MCA education ) అవుతుందో ఏమిటో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనలు చూస్తే.. మానవజాతి ఏమౌతుందో కూడా అర్ధం కావడం లేదు. కొన్ని వార్తలు ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని కలిగించినా కూడా వాటి గురించి తెలుసుకుని.. మన చుట్టూ అలాంటివి జరక్కుండా చూసుకోవడం మంచిది.
నెల్లూరులో ఒక అన్యాయకరమైన, దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. నెల్లూరులో అనూషా అనే ఒక అమ్మాయి ఉంది. ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ బంధువుల అబ్బాయి మణికంఠ తో పెళ్లయింది. ఈమె ఎంసిఏ చదువుతూ ఉండగా పెళ్లి చేసేసారు. ఆ తరవాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు కృతిక, లక్ష్మీహారికా అని పెట్టారు. అనూషా భర్త ఒక హోటల్ నడుపుతన్నాడు. ఈ నెలలో అనూషా వాళ్ళ బంధువుల ఇంటికి ( In Nellore one mother killed her daughter for her MCA education ) పిల్లలు ఇద్దరినీ తీసుకుని వెళ్ళింది. అక్కడ రాత్రి పడుకుని పొద్దుట ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యింది.
ఆ రాత్రి చిన్న కూతురిని ఊయలలో పడుకోబెట్టి.. పెద్ద కూతురితో అనూషా కింద పడుకుంది. పొద్దుట 7 గంటలకు లేచి చూస్తే.. ఊయలలో చంటి పిల్ల లేదు. దానితో పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. పోలీసులు అన్ని చోట్లా గాలించగా, అందరిని ఎంక్వయిరీ చేయగా చివరికి అనూషా మీద అనుమానం వచ్చి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆమెని మొదట విచారణ మొదలు పెట్టక.. ఆమె నాకేమి తెలీదు, నా బిడ్డ గురించి నేను కంప్లైంట్ ఇస్తే.. మీరు నన్ను అడుగుతారేంటి అని అడిగింది. అయినా కూడా పోలీస్ లు చాలా తెలివిగా విచారణ చేయగా అసలు విషయం బయట పడింది.
ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. అనూషకి తన చదువు, కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని, దానిని సాగించాలంటే.. ఆ చిన్న అమ్మాయి తనకి చాలా అడ్డుగా ఉందని తీసుకుని వెళ్లి ఇంటి వెనుక ఉన్న సర్వేపల్లి కాలువలో పడేశానని చెప్పింది. ఈతగాళ్లను పెట్టి ఆ కాలువలో వెతికించగా ఆ చిన్నారి శవం కనిపించింది. దానితో కిడ్నాప్ కేసుని మర్డర్ కేసుగా పోలీసులు రాసుకుని, అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదువు కెరియర్ కోసం కన్నబిడ్డని చంపిన ఈ తల్లి.. ఎంత ఎదిగినా దేశానికి ఇలాంటి వాళ్ళ వలన చెడే జరుగుతుంది తప్ప ఎటువంటి మంచి జరగదని నెటిజలు వాపోతున్నారు.