Home Cinema Sam – Vijay: మరొక చిత్రంలో మళ్ళీ రొమాన్స్ కు సై అంటున్న సమంత –...

Sam – Vijay: మరొక చిత్రంలో మళ్ళీ రొమాన్స్ కు సై అంటున్న సమంత – విజయ్ దేవరకొండ. మరి ఆ చిత్రమేంటంటే.?

Sam – Vijay: ప్రస్తుతం కేవలం మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఎక్కడ చూసినా సరే ఓ వైపు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పేరు మరొక వైపు సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత పేరు పేర్లు వినిపిస్తున్నాయి. మరి అందుకు అసలు సిసలైన కారణమేంటంటే ఇటీవల విడుదలై సూపర్ హిట్ సాంగ్ చేసుకున్న ఖుషి చిత్రమే.. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించినటువంటి డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తారీకున విడుదలై అందరి అంచనాలను తారుమాలు చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దక్కించుకుంది.

See also  Anasuya : పుట్టినరోజని.. విమానంలో అనసూయ ఏం చేసిందో చూడండి..

in-another-film-sam-vijay-deverakonda-again-says-yes-to-romance-and-what-is-that-film

ఇదే కాకుండా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రానికి తిరుగు లేకుండా చాలా రోజులు తర్వాత ఇటు సమంతకు అటు విజయ్ దేవరకొండకు కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే సమంత విజయ్ దేవరకొండలు కలిసి చేసినటువంటి రొమాన్స్ గా నిలిచాయి. దాంతో ఓ పక్క సమంత అభిమానులు మరో పక్క విజయ్ దేవరకొండ అభిమానులు వీళ్ళిద్దరూ కలిసి మరొకసారి వెండి తెర పై ఇలాంటి క్యూట్ హాట్ పెర్ఫార్మెన్స్ తో రొమాన్స్ చేసి అదర గొడితే చూడాలని అనుకుంటున్నారట వీళ్ళిద్దరి అభిమానులు..

See also  Ram Charan: షాకింగ్ న్యూస్…సినిమాలకు బ్రేక్ ఇక..!! సంచలన కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

in-another-film-sam-vijay-deverakonda-again-says-yes-to-romance-and-what-is-that-film

ఇదే క్రమంలో ఇలా కోరుకుంటున్నా అభిమానులకి త్వరలోనే శుభవార్త రాబోతుందంటూ సోషల్ మీడియాలో అయితే వార్త జోరుగా వైరల్ అవుతుంది.. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త ప్రకారం గౌతం తిన్నూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఎంపిక జరిగినట్లు ప్రచారం అయితే సాగుతోంది.

in-another-film-sam-vijay-deverakonda-again-says-yes-to-romance-and-what-is-that-film

కాగా ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీ లీల ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినప్పటికీ ఖుషి చిత్రంలో వీరిద్దరి (Sam – Vijay) రొమాన్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వడంతో ఈ చిత్రంలో సమంతనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారంటూ అర్థం అవుతుంది. కానీ మనందరికీ తెలిసిన విషయమేంటంటే సమంత ప్రస్తుతం చిత్రాలకు కాసంత గ్యాప్ ఇచ్చి మయోసైటీస్ వ్యాధి నుండి బయటపడడానికి చికిత్స తీసుకోవడానికి ఆ కారణం చేతనే అమెరికా వెళ్ళింది. కానీ ఖుషి చిత్రం ఇంత పెద్ద ఎత్తున హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో సమంత కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. దాంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.