Actor Ashish: నటుడు ఆశీష్ విద్యార్థి ఇటీవలే రెండో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇస్తూ వార్తల్లో తెగ వైరల్ అవుతున్నాడు. అతను వివాహం చేసుకున్న తన రెండవ భార్య పేరు రూపాలి బారువా.. ఇక తన మొదటి భార్య నటి రాజోషి కి గత సంవత్సరం విడాకులు ఇచ్చేయగా.. ఇటీవలే ఎరి కోరి రూపాలి బారూవా ను ప్రేమించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆశీస్సు విద్యార్థి.. ఇక తన మొదటి భార్య నటి రాజోషి కి అలాగే ఆశిష్ విద్యార్థికి ఒక కొడుకు ఉన్నాడు తన పేరు ఆర్థ్.. కాగా వీళ్ళిద్దరూ తమ కొడుకు విషయంలో ఎంతో గర్వపడుతూ ఉండేవారు.
ఇక వీళ్ళ వివాహం వైరల్ అవుతున్న వేళ అసలు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తాను రెండో వివాహం ఎందుకు చేసుకోవాల్సిందో ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలియజేసాడు ఆశిష్.. ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలని వాళ్ళిద్దరూ నిశ్చయించుకున్నాక ఈ విషయాన్ని వాళ్ళ కొడుకు ఆర్థ్ తో చెప్పడానికి ఎంతో సతమతమయ్యారంటూ చెప్పుకొచ్చాడు.. ఇక ఇదే విషయాన్ని తన కొడుకుతో చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడినట్లు వెల్లడించారు.. అలా చెప్పడానికి నాకు ఎంతో గిల్టీగా అనిపించిందని తెలిపారు.
ఎందుకంటే నేను మరియు నా మొదటి భార్య పిలూ ఇక అతనికి జీవితాన్ని ప్రసాదించాము కానీ ఆ తర్వాత ప్రస్తుతం ఇలాంటి జీవితం ఇస్తామని అస్సలు అనుకోలేదంటూ తెలియజేశాడు. చాలా కాలం నుంచి మేమిద్దరం గొడవలతో సతమతమవుతూ సంసారం అనే జీవితంలో గొడవలు పడుతూ వస్తున్నాం. ఇక పరిస్థితి తీవ్రత మరింత గందరగోళం కాకముందే ఎవరికి వారు విడిపోవాలని చేయించుకున్నాం. ఇక మేము తీసుకున్న ఈ నిర్ణయం మా అబ్బాయి ఆర్థ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఎప్పటి నుండో ఓ నిర్ణయానికి వచ్చాం. మేము ఇద్దరం ఎన్నో రకాల గొడవలతో ఇబ్బంది పడుతున్నామన్న సంగతి ఆర్థ్ కి కూడా తెలుసు.
ఒక వేళ మా మధ్య ఈ గొడవలు ముదురి ఒక్కోసారి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదు. మేము ఇద్దరం ఇలా ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం కొట్టుకుంటూ గొడవలు పడేదానికంటే విడిపోయి సుఖంగా ఉండడం మేలని భావించాము.మేమిద్దరం నిత్యం గొడవలు పడుతున్న విషయం ఆర్థ్ కు కూడా తెలుసు. ఇక ఒకప్పుడు పరిస్థితి ముదిరే కొద్దీ తీవ్ర పరిణామాలు సంభవించేవి. ఓకే ఇంట్లో ఉంటూ ఇక ఇలా ఎంతకాలం కొట్లాడుకుంటూ ఉండడం అని ఇద్దరం డిసైడ్ అయ్యి ఎవరికి వారు విడిపోయాం.. మా ఇద్దరి కారణంగా అబ్బాయి జీవితం నాశనం అవద్దని భావించాము. ఇదే విషయాన్ని మా అబ్బాయికి చాలా అర్థవంతంగా వివరించాం మేము విడిపోతున్నామని.. ఇక అతను కూడా మా నిర్ణయానికి స్వాగతం పలికాడు అంటూ (Actor Ashish) ఆశిష్ వివరించారు.