Home Cinema Hyper Aadi: హైపర్ ఆదిని ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్.. పాపం ఆది పరిస్థితి?

Hyper Aadi: హైపర్ ఆదిని ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్.. పాపం ఆది పరిస్థితి?

హైపర్ ఆది మాట్లాడితే చాలు నవ్వు వచేస్తాది. ధనుష్ సినిమా సార్ ట్రైలర్ రిలీజ్ వేడుకకి హైపర్ ఆది కూడా పాల్గున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా సార్. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్టారు మాస్టారు అనే పాట ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. సార్ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ధనుష్ అంటే మన తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. ధనుష్ సినిమా కొంచెం బాగున్నా కూడా చాలా బాగా ఆదరిస్తారు. ఎందుకంటే ధనుష్ సినిమా అంటే.. మొత్తం ధనుష్ భుజాల మీదే ఉంటాది. ధనుష్ నటన గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు.

See also  Animal : అనిమల్ లో ఆ సీన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన దర్శకుడు.. మరీ ఈ నాకుడు బాధేమిటో..

ఎలాంటి పాత్రలోనైనా.. సాటి నటులతో చక్కగా కెమిస్ట్రీ కుదుర్చుకుని సినిమాని అలా నిలబెడతాడు ధనుష్. రఘువరన్ బీటెక్ తో తెలుగువాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించిన ధనుష్.. ఇప్పటివరకు అదే స్టాండర్డ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సార్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకకి వెళ్లిన హైపర్ ఆది మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా హిట్ అవుతుందని, ఒక తెలుగు యువ దర్శకుడు ధనుష్ లాంటి టాప్ హీరోని కథ చెప్పి ఒప్పించడం నిజంగా తెలుగువారు గర్వించాలని ఆది అన్నారు.

See also  Pushpa 2 : పుష్ప 2 లో అల్లు అర్జున్ చనిపోతాడట.. అసలు ట్విస్ట్ ఇలా మొదలవుతాదట..

ఆది.. నాగ వంశీ గురించి కూడా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ టైం లో, నేను నాగ వంశీ గారికి ఫోన్ చేసి, నేను ఢీ కి వెళ్లాలని అంటే.. నీకు ఢీ కావాలా? పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకో అన్నారు. అంత మాట అన్నాక ఎం చేస్తాను? పవన్ కళ్యాణ్ కావాలనుకుంటూ, చేతులు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారితో పాట షూటింగ్ కి వెళ్ళాను అని చెప్పారు. పాపం పవన్ కళ్యాణ్ వలన ఆది ఎంత టెంక్షన్ పడి ఉంటాడో!