Bichagadu : ఈ ప్రపంచంలో రోజురోజుకీ డబ్బు విలువ ఎంత పెరిగిపోతుందో మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇది ఒకరి మీద మాత్రమే వేసుకునే నింద కాదు. ఎవరికి వారమే ఎప్పటికప్పుడు మన గురించి మనం అప్డేట్ చేసుకుంటూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది కాలం గడిచే కొద్ది డబ్బు విలువ పెరుగుతూ.. మనిషి విలువ తగ్గుతూ.. నా అనే వాళ్లనేది ఆలోచించకుండా.. నేను అనేది కూడా ఆలోచించలేని ( money donated by this beggar ) స్థితికి వెళ్తామని తెలుసుకోకుండా.. డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటున్నారు. డబ్బుంటే ఇష్టం పెరిగే కొద్దీ.. నా అనే మనుషులను ప్రేమించడం మానేసి, వాళ్లకి ఇచ్చే ప్రతి రూపాయి గురించి ఆలోచించి, దానధర్మాలు అనేవి చేయకుండా.. నిరంతరం పరుగులు పెడుతుంటే చివరికి డబ్బు మీద ఆసక్తి పెరిగి జబ్బుల పాలు అవ్వడం తప్పితే ఇంకేమీ ఉండదు.
మనిషికి మనిషి సాయం చేసుకోకపోయినా, ఒకరికి ఒకరు అన్యాయం చేసుకున్నా, పాపానికి పోతారని పూర్వము భయపెట్టేవారు. అది కొంతకాలానికి వదిలేశారు.. పాపం అనేది లేదు, నరకం అనేది లేదు అని.. అందుకే ఇప్పుడు నిజంగానే ఎక్కడా పాపము, నరకం అనేది ఎక్కడో చచ్చేపోయాక లేదు.. ఇక్కడే కనిపిస్తుంది. ఎప్పుడూ డబ్బు డబ్బు అని చుట్టూ ఉన్న వాళ్ళని తినేసి.. తనకు తానే సుఖపడదామని.. అనవసరమైన ( money donated by this beggar ) ఆడంబరాలు నేర్చుకుని, వ్యసనాలు నేర్చుకొని, సుఖపడుతూ చివరికి నాకు నేను అనేది మిగిలేది కూడా లేకుండా జబ్బుల పాలు అయ్యి.. ఉన్న డబ్బుని హాస్పిటల్స్ ఖర్చు పెడుతూ లేదా చుట్టూ ఉన్న వాళ్ళ డబ్బు కోసం నన్ను ఏం చేస్తారు అని భయపడుతూ.. ప్రతి క్షణాన్ని ఇక్కడే నరకం చూసుకుంటూ చనిపోతున్నాడు.
మనిషి డబ్బు అనేది అవసరం కానీ.. అదే ఆయువు కాదు. అది ప్రాణం కాదు, అది మనిషి కాదు, అది ప్రేమ కాదు. అవసరమైనవన్నీ వదిలేసి అవసరాలను కాపాడుకునే ఒక అవసరాన్ని చాలా ఎక్కువగా ప్రేమించేసి.. మనిషి ఏదో అయిపోతున్నాడు. ఇలాంటి రోజుల్లో ఒక వ్యక్తి 75 ఏళ్ల వయసులో తాను చేస్తున్న పని చూసి ( money donated by this beggar ) అందరూ అవాక్కపోతున్నారు. తమిళనాడులోని పాండే అనే ఒక వ్యక్తి .. భార్య పిల్లలు అందరూ కలిగి ఉండి మహారాజులు హాయిగా బతుకుతున్న అతని జీవితంలో.. సడన్గా అతని భార్య చనిపోయింది. భార్య చావుతో బిడ్డలు కూడా అతన్ని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో ఉంటూ కనీసం చూడ్డానికి రాకుండా ఉన్న క్రమంలో.. వైరాగ్యం వచ్చిన అతను ఇది కాదు జీవితం అని తెలుసుకుని.. బిచ్చం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు.
కాషాయ వస్త్రం వేసుకొని అతను బిచ్చం ఎత్తుకుంటుంటే.. జనాలు అందరూ డబ్బులు కొంచెం బాగా వేయడం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బును మొత్తం తీసుకొని అందులోంచి తనకి కావాల్సిన తిండికి డబ్బులు వాడుకొని మిగిలిందంతా దానాలు చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా అతను ఎన్నో లక్షల దానం చేశాడు. ఆ తర్వాత తమిళనాడులో కొన్ని కుటుంబాల సైతం ఏదో నష్టం వచ్చిందని తెలిసి.. సీఎం ఫండ్ కి డబ్బులు అందించడం కోసం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ అతన్ని బయటకి గెంటేస్తున్న క్రమంలో.. అతను అడుక్కోడానికి రాలేదని సీఎం ఫండ్ కి డబ్బు డొనేట్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు లోపలికి వచ్చి అక్కడ సీఎం ఫండ్ కి డబ్బు డొనేట్ చేస్తూ ఉండగా..
కలెక్టర్ అతన్ని చూసి.. అతన్ని సోషల్ మీడియాలో ఇంతకుముందు చూశానని అడిగి.. అతని గురించి తెలిసి వెళ్లి.. కలెక్టర్ బిచ్చగాడితో సెల్ఫీ దిగాడు. అయితే అతన్ని కలెక్టర్ ఎందుకు మీరు ఇంత కష్టపడి అడుక్కొని ఆ డబ్బంతా దానం చేస్తారు? మీరు దాచుకోలేదు ఎందుకు అని అడగ్గా.. నేను తినడానికి ఎంత ఖర్చవుతుంది? మహా మహా కోటీశ్వరులకు ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడానికి ప్రాణం ఒప్పట్లేదు. డబ్బు ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు. ఇలాంటి ప్రపంచంలో డబ్బు కోసమే మాట్లాడుతూ.. బతికితే ఏమి వస్తాది. ఇక్కడి నుంచి తీసుకెళ్లేదేముంది? నలుగురుకి ఉపయోగపడి జీవితం సాగిస్తే వెళ్ళిపోయే లోపు నాకు అదే సంతృప్తిమిస్తుంది.. అని అతను చెప్పిన దానికి హాట్సాఫ్ చెప్పాడు కలెక్టర్. బిచ్చగాడు అనే సినిమా ఫ్రిక్షన్ గాని.. ఇతను రియల్ బిచ్చగాడు అయినా కూడా ఇతనే రియల్ హీరో అని ఇతనికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.