Home Cinema Honey Rose : హనీ రోజ్ కొంపముంచిన ఆ స్టార్ హీరో.. ఇక ఆమె పరిస్థితి...

Honey Rose : హనీ రోజ్ కొంపముంచిన ఆ స్టార్ హీరో.. ఇక ఆమె పరిస్థితి ఏమిటో!

honey-rose-not-getting-offers-because-she-made-her-remuneration-very-high

Honey Rose : సినిమా ఇండస్ట్రీలో హీరోలు మంచి నేమ్ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ హీరోయిన్స్ కి కొంచెం గ్లామర్ తోడై అదృష్టం బాగుంటే.. వెంటనే మంచి నేమ్ వస్తుంది. అలాంటి వారిలోనే హనీ రోజ్ ( Honey Rose not getting offers ) కూడా ఒకర్తి.. పెద్దగా సక్సెస్ సాధించకపోయినా ఆమె కంటూ ఒక క్రేజ్ బాగానే సంపాదించుకుంది. మలయాళీ నటి అయిన హనీ రోజ్ అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. పెద్దగా పేరు రాలేదు కానీ బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాత ఆమెకు మంచి నేమ్ వచ్చింది. బావ మనోభావాలు దెబ్బతింటాయి అనే పాటతో ఆమెకి ఇంకా క్రేజీ పెరిగింది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మా బావ మనోభావాలు దెబ్బతింటాయి అనే పాటతో ఆమె అందాలను ఆరబోస్తూ..రెచ్చిపోయి వేసిన డాన్స్ ఇప్పటికీ కుర్రకారుని ఎర్రెక్కిస్తుంది.

See also  Pushpa 2: తన సినిమా ప్రమోషన్ కోసం పుష్ప 2 స్టోరీ చెప్పేసిన రన్బీర్ కపూర్..

honey-rose-not-getting-offers-because-she-made-her-remuneration-very-high

ఈ సినిమా వలన ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు ఆఫర్ల వర్షం కురుస్తుందని, సినిమాల్లో తెగ కనిపిస్తుందని, అందరూ ఊహించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యి.. ఆ సినిమా తర్వాత ఆమెకు ఒక్క సినిమా ( Honey Rose not getting offers ) కూడా ఆఫర్ దొరకలేదు. తర్వాత సినిమాలోని కనిపించకపోగా ఇంతవరకు ఏ సినిమాకి కూడా సైన్ చేసిన దాఖలు లేదు. ఇంత హిట్ కొట్టిన తర్వాత.. పైగా సినిమాలో అంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఈమెకు సినిమాలు ఎందుకు దొరకడం లేదని అందరూ ఆలోచిస్తున్నారు. ఇకపోతే సినిమా ఆఫర్లు అయితే దొరకడం లేదు కానీ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఎన్నో పోస్ట్లు పెడుతూనే ఉంటుంది.

honey-rose-not-getting-offers-because-she-made-her-remuneration-very-high

ఆ పోస్టులు చూసి విపరీతమైన లైకులు, షేర్లు, కామెంట్లు వస్తూనే ఉన్నాయి. అంటే హనీ రోజ్ ఆడియన్స్ కి అందుబాటులోనే ఉంది.. ఆడియన్స్ కూడా ఆమెకి ఇంకా ఎట్రాక్ట్ అవుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. అన్ని బాగానే ఉన్నా కూడా ఎందుకు సినిమా ఆఫర్లు దొరకడం లేదు అనేది అందరి ఆలోచన. అయితే కొందరేమో ( Honey Rose not getting offers ) ఈమె బాలకృష్ణతో కలిసి సినిమా నటించడం వలన.. ఈమెతో చిన్న చిన్న హీరోలు నటించడానికి ఇష్టపడరు అని కొందరు అంటుంటే.. అందులో పెద్దగా సరైన రీజన్ లేదని మరికొందరు అంటున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే హనీ రోజ్ కు సినిమా ఆఫర్లు రాకపోవడానికి కారణం ఎవరో కాదు హనీ రోజ్ నే నట.

See also  Ravanasura review rating: రావణాసుర రివ్యూ మరియు రేటింగ్

honey-rose-not-getting-offers-because-she-made-her-remuneration-very-high

ఎప్పుడైతే బాలకృష్ణ సరసన నటించి సూపర్ నేమ్ తెచ్చుకుందో.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆలోచనతో రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచేసింది అంట. ఎంత హనీ రోజ్ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. స్టార్ హీరోలు సరసన సెకండ్ హీరోయిన్ గా పెట్టగలరు తప్పా.. మెయిన్ హీరోయిన్ గా పెట్టగలిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు సెకండ్ హీరోయిన్ కి అన్ని కోట్లు ఇచ్చి మరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని దర్శకులు, నిర్మాతలు భావిస్తారు. బాలకృష్ణ సరసన అంత హిట్ కొట్టడం వల్లే.. హనీరోజ్ జీవితం ఇలా అయిందని.. ఆమెకు అంతపెద్ద హిట్ రాకపోయినా.. బాలయ్య పక్కన అంత క్రేజ్ సంపాదించుకోకపోయినా.. ఏమైనా నేల మీద ఉండి కొంచెం రెమ్యూనికేషన్ తో ఎక్కువ సినిమాలు నటించును అని అందరూ అనుకుంటున్నారు.