Home Cinema Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్.. డిమాండ్ అలాంటిది.!

Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్.. డిమాండ్ అలాంటిది.!

Honey Rose: అప్పట్లో తెలుగులో తను నటించినది కేవలం రెండే రెండు చిత్రాలు..ఒకటి ఈ వర్షం సాక్షిగా, రెండు ఆలయం. ఈ చిత్రాలతో అప్పుడెప్పుడో 2008 సంవత్సరంలో మొదటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో అంతగా పాపులారిటీ తెలుగులో సంపాదించుకోలేకపోయింది..కానీ మలయాళం లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అలా గోపీచంద్ మలినేని కంటపడడంతో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మీనాక్షిగా తనకు అవకాశం ఇవ్వడంతో.. రాత్రికి రాత్రే ఇక్కడ కూడా స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. (Honey Rose Remuneration)

See also  Pushpa 2 : పుష్ప 2 గురించి ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ లో ఇదే పండగలాంటి వార్త.

honey-rose-is-also-taking-huge-remuneration-for-this-work

ఆమె అప్పుడే విరబూసిన లేలేత గులాబీ లాంటి అందంతో ఇక్కడ తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారిగా ప్రస్తుతం గుర్తింపు పొందింది.. ఈ మలయాళ ముద్దుగుమ్మకు విపరీతమైన పాపులారిటీ లభించడంతో మరోపక్క సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఒకప్పుడు ఎవరు పట్టించుకోని ఈ అమ్మడికి ఇప్పుడు ఆఫర్లు దారులు కడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా తన అంద చందాలను ధారపోస్తూ యువతను ఉర్రూతలు ఊగించడంలో ముందుంది హనీ రోజ్.. ఈమె మలయాళలో అక్కడ దూసుకుపోయి ఇక్కడ కూడా ప్రస్తుతం తన హవా కొనసాగిస్తుందని చెప్పాలి..

honey-rose-is-also-taking-huge-remuneration-for-this-work

మలయాళంలో మోహన్ లాల్ తో ఒక సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం తర్వాతే ఈ అమ్మడికి బాగా క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఫుల్ బిజీగా కనిపిస్తుంది. భాష ఏదైనా అవకాశం అందుకోవడమే పనిగా మార్చుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువగా ప్రమోషన్స్ తో భారీ క్రేజ్ దక్కించుకుంటుంది. ఎక్కడ ఏ షాప్ ఓపెనింగ్ అయినా మాల్ ఓపెనింగ్ అయినా  కార్ ఓపెనింగ్ అయిన ఇలా దేనికైనా సరే హనీ రోజ్ ఉండాల్సిందేనట.. ఇటీవలే హైదరాబాద్ లో కూడా ఓ గ్రాండ్ హోటల్ ప్రారంభంలో తను పాల్గొన్నది.

See also  Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

honey-rose-is-also-taking-huge-remuneration-for-this-work

ఇక అసలు విషయానికి వస్తే ప్రమోషన్స్ తో ఇంత బిజీ ఉన్న అమ్మడు సంపాదన గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ వెతుకుతున్నారట..మరి తను ఒక షాప్ ఓపెనింగ్ కి ఎంతవరకు తీసుకుంటుందో (Honey Rose Remuneration) మీకు తెలిస్తే నోరెళ్ళ పెడతారు..కానీ హనీ రోజ్ ఈ పనులు చేస్తూ కూడా ఒక షాప్ ఓపెనింగ్ కి దాదాపు 8 నుంచి 10 లక్షలు తీసుకుంటుందట..ఎందుకంటే ఈమెను చూడడానికి భారీ ఎత్తున అభిమానులు రావడంతోటే ఆమెకు అంతలా డబ్బుకు ఆఫర్ చేస్తున్నారట..వీర సింహారెడ్డి చిత్రం తర్వాత క్రేజ్ బాగా పెరిగిపోవడంతో ప్రమోషన్స్ బాగా వస్తున్నాయని చెప్పాలి ఈ మలయాళ కుట్టికి..