
Hina Khan : ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఉప్పెన వస్తూ వస్తూనే ఉంటుంది. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం చాలా సహజంగా సాగిపోయేదే జీవితం. వాటిని అలవాటు పడుతూ, రెండిటిని సమన్వయంగా అర్థం చేసుకుంటూ ముందుకు ( Hina Khan fights with cancer ) సాగడమే మనిషి జీవిత పరమార్ధం. అయితే ఆర్థిక పరంగా వచ్చే ఇబ్బందులు ఒకరకంగా ఉంటే ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులు మరోరకంగా ఉంటాయి. ఎంతటి ప్రముఖులకైనా ఈ రెండు తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఎవరినైనా కృంగదీస్తాయి. అలాగే ప్రస్తుతం హీరోయిన్ హీనా ఖాన్ అనారోగ్య పరిస్థితితో పోరాడుతుంది.క్యాన్సర్ అనేది ఈరోజుల్లో చాలా ఎక్కువగానే వింటున్నాం. ఆడవాళ్లలో ముఖ్యంగా ఇది ఒక వయసు దాటిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది.
సెలబ్రిటీస్ ని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయి. చాలా కష్టతరమైన ట్రీట్మెంట్లని చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కీమోథెరపీ.. ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆడవాళ్లు కానీ ( Hina Khan fights with cancer ) మగవాళ్ళు గాని చాలా చికాకు లోనవుతారు. ఈ ట్రీట్మెంట్ సమయంలో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు. నీరసంగా ఉండడం, వాంతులు అయిపోతూ ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ ముఖ్యంగా అందరిలో ఎక్కువగా కనిపించేది జుట్టు రాలిపోవడం. విపరీతంగా జుట్టు రాలిపోతున్న ఈ సమయంలో అందరూ చివరికి గుండు చేయించుకొని, ఆ సమస్యను ఎదుర్కొంటారు. అలాగే సినిమా నటి హీనా ఖాన్ కి కూడా ఈ సమస్య వచ్చింది. అయితే ఆమె ఎదుర్కొనే విధానం, మాట్లాడే తీరులో ఎంతో ధైర్యాన్ని చూపిస్తుంది.
హీనా ఖాన్ తనకి క్యాన్సర్ వచ్చిందనే విషయం అభిమానులకు చెప్పిన తర్వాత.. ఆమె ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలాగే భయంకరమైన వ్యాధితో ఉన్నప్పుడు మనోధైర్యం చాలా అవసరమని, మన ధైర్యమే మన ఆరోగ్యాన్ని సరిచేస్తుందని, మనల్ని కాపాడుకుంటామని ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అలాగే ( Hina Khan fights with cancer ) ఇటీవల కీమోథెరపీ చేయించుకుంటున్న ఆమెన్ తన జుట్టు రాలిపోతున్నా.. దాన్ని కూడా పట్టించుకోకుండా.. దానికి గుండు చేయించుకుంటూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేసి మరి.. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్పుడే మనం ధైర్యంగా ఉంటామని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులందరూ మీరు ఇంతే ధైర్యంగా ఉండి.. క్యాన్సర్ అనే మహమ్మారిని ఎదుర్కొని.. వీలైనంత తొందరగా మంచి ఆరోగ్యంతో బయటికి వచ్చి.. సినిమాలలో నటించాలని కోరుకుంటున్నామని అందరూ మెసేజ్లు పెడుతున్నారు.