Neha Shetty: మోడలింగ్ తో తన వృత్తిని ప్రారంభించిన నేహా శెట్టి 2014లో మంగళూరు అందాల పోటీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా 2015లో రన్నరప్ గా నిలిచింది. దీంతో కన్నడలో కన్నడ చిత్రం మాంగారు మాలె 2 లో అవకాశం రావడం తో హీరోయిన్ గా తొలి చిత్రంలో నటించినది. ఆమె నటనకు మంచి గుర్తింపు కూడా లభించింది. అలా ఈ కన్నడ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు నటించిన మెహబూబా సినిమా లో చోటు దక్కించుకుంది.
2021లో ఆమె గల్లి రౌడి సినిమాలో సందీప్ కిషన్ సరసన ప్రధాన పాత్రలో నటించి మంచి యాక్టింగ్ ప్రతిభను చూపెట్టింది. ఆ తరువాత 2022లో సిద్దు జొన్నలగడ్డతో కలిసి డిజే టిల్లు సినిమాలో నటించింది తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ. ఈ సినిమాలో నేనా శెట్టి హాట్ గ్లామర్ షోకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇకపోతే సోషల్ మీడియాని ఎవ్వరూ వదలట్లేదు సీనియర్ నటుల నుంచి జూనియర్ నటుల దాకా ప్రతి ఒక్కరు ఫోటోల జాతర కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో నేహా శెట్టి డార్క్ మోడ్ తో అందరికీ అందాల విందు పెట్టింది.
దీంతో ఆ ఫోటోలు చెక్కర్లు కొడుతూ వైరల్ గా మారాయి. అసలే మత్తెక్కించే చూపులతో వయ్యారాలు ఓలకపోస్తున్న ఈ అమ్మడు ఈ మధ్య తన గ్లామర్ డోస్ ని మరింత పెంచింది. ఇలా హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్న ఈ అమ్మడికి సోషల్ మీడియాలో సైతం అలాగే కుర్రకారులు క్యూ కడుతున్నారు.