Hero Surya Loved: కోలీవుడ్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ వివరాలు వెతికితే మొదట కనిపించే జంట మాత్రం సూర్య జ్యోతిక అని కచ్చితంగా చెప్పవచ్చు. అంత చూడముచ్చటైన జంట సూర్య జ్యోతికలదే.. వసంత్ దర్శకత్వంలో తెరికేక్కిన పోవేల్లుం కేట్టుప్పర్ అనే చిత్రంతో సూర్య, జ్యోతికల మధ్య మొదటి పరిచయం మొదలైంది. దాని తర్వాత కొన్ని చిత్రాలు కలిసిన నటించిన తర్వాత వీళ్ళ మధ్య ఏర్పడిన బంధం ప్రేమగా మారింది.
దాంతో ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సూర్య కెరియర్ మరింత మెరుగుపడింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో స్థాయిలోకి చేరుకున్నాడు. అలాగే జ్యోతిక కూడా ప్రస్తుతం సినిమాల్లో తనకు తగ్గ పాత్రల్లో నటిస్తుంది. తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. దాదాపు పెళ్లైన పదిహేనేళ్ల తర్వాత తను రీఎంట్రీ ఇచ్చింది.
సూర్య జ్యోతిక దంపతులు పెళ్లయ్యి ఇన్నేలవుతున్న ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరో జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు గొప్పగా చెప్పుకుంటారు. పెళ్లి తర్వాత జ్యోతిక తన జీవితాన్ని మార్చేసిందని నాకు ఏం కావాలన్నా ముందే అన్ని ఆలోచించి సడన్ సర్ప్రైజింగ్ చేస్తుందని చాలాసార్లు సూర్య భార్య గురించి చెప్పగా, జ్యోతిక కూడా భర్త పై అనేక సార్లు తన ప్రేమని తెలిపింది. ఐతే విషయానికి వస్తే సూర్య జ్యోతిక కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం ఎవరికీ తెలియదు.
సూర్య కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయితో (Hero Surya Loved) ప్రేమలో పడ్డాడంట.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పిన పెళ్లి చేసుకుని సూర్యకు పెద్ద షాక్ ఇచ్చిందంట. దాంతో చేసేదేమీ లేక సూర్య కొన్నేళ్ళ తర్వాత ఆమెను మర్చిపోయాడు అంట. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అయినా ప్రేమ దోమ ఏది లేకుండా ఉండాలనుకున్నాడట. కానీ అనుకోకుండా జ్యోతిక తో ప్రేమలో పడి ఆమెతో ఏడడుగులు వేశాడు.