Hero GopiChand: మొదటగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమైన గోపిచంద్ ఆ తరువాత విలన్ గా కూడా నటించి అందరినీ మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు హీరో గోపిచంద్. ఇక గోపిచంద్ తన తొలి చిత్రం తొలి వలపుతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. తన తొలి సినిమా అంతగా హిట్ కాకపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు గోపిచంద్. ఇక ఆ తర్వాత హీరోగా చేయకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాడో..
ఏమో జయం చిత్రంలో విలన్ గా అవకాశం లభించింది. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపిచంద్ విలన్ గా ఎంతగా ఒదిగిపోయాడంటే మనమంతా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరముండదు. ఇకా తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం వర్షంలో విలన్ గా అదే విధంగా ప్రభాస్ నటించిన వర్షం చిత్రంలో విలన్ గా నటించి ఎంతగానో పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత యజ్ణం సినిమాలో హీరోగా అవకాశం రావడంతో మళ్ళీ హీరోగా మారాడు. ఇక యజ్ఞం చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మళ్ళీ గోపి చంద్ (Hero GopiChand) కు హీరోగా అవకాశం లభించింది.
ఇక ఆ చిత్రం నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం సినిమాలు చేస్తూ వస్తున్నాడు గోపిచంద్. ఇక గోపిచంద్ తన తదుపరి రాబోయే చిత్రం రామబాణం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా డింపుల్ హయతి నటించనున్నది. ఇక ఈ చిత్రం మే నెల 5వ తారీకున విడుదలవ్వడానికి రెడీ గా ఉంది. దాంతో హీరో గోపిచంద్ ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా వరుసగా సినిమా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొంటు గోపిచంద్ తన పిల్లల విషయం గురించి ఓ షాకింగ్ ప్రస్తావన వెల్లదీసాడు.
నేను హీరో అయినపప్పటికీ అందరిలాగే అందరితో సమానంగా నా పిల్లలను స్కూల్ బస్సుల్లోనే స్కూల్ కి పంపిస్తాను. నేను వాళ్ళకు అస్సలు కార్ ఇచ్చి ప్రత్యేకంగా పంపిచను అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకు ముఖ్యంగా డబ్బు విలువ, కష్ఠం విలువ తెలియాలి. ఇదే కాకుండా డబ్బు ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా మితంగా ఇస్తూ పొదుపుగా వాడటాన్ని నేర్పుతాను. చిన్నతనం నుండి ఇలా చేస్తేనే వాళ్ళకు డబ్బు విలువ తెలిసి ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు వాళ్ళకు ఖచ్చితంగా అర్దమవుతుందని గోపిచంద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వూలో తెలియజేసాడు.