Adivi Sesh-Supriya: మనందరికీ తెలిసిన విషయమే.. సెలబ్రిటీలు కాస్తంత చనువుగా ఉంటే చాలు వాళ్ళిద్దరి మధ్యలో ఏదేదో ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. అలా ఇటీవలే ట్రోల్ కు గురయ్యి వైరల్ అయ్యింది మాత్రం నాగచైతన్య – శోభిత ధూళిపాల.. వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే కాక లండన్ లో హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ చెఫ్ సురేంద్ర మోహన్ తో దిగిన ఫోటో వెనకాల టేబుల్ లో చెయ్యి అడ్డుపెట్టుకుని శోభిత ధూళిపాల కూర్చునే ఉంది.
ఇక ఆ ఫోటోతో వీళ్ళిద్దరి ప్రేమ నిజమే అని ఓ కొలిక్కి వచ్చింది. ఇదే విధంగా సినీ ఇండస్ట్రీలో మరొక జంట కూడా మీడియాకి అడ్డంగా దొరికిపోయింది. వాళ్లెవరో కాదు యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh-Supriya) అలాగే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ.. వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడడానికి కారణం వీళ్లిద్దరూ కలిసి నటించిన గూడచారి చిత్రం. ఆ చిత్రంతోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇలా చిగురించి ఇంత దూరం వరకు వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే అక్కినేని కుటుంబంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు అడవి శేష్ (Adivi Sesh-Supriya) హాజరయ్యి సుప్రియ పక్కనే కూర్చోడం.. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే భావనకు తెరలేపింది. అదొక ఎత్తయితే.. తాజాగా వీరిద్దరూ మరోసారి ఒకే కారులోనే మొన్న జరిగిన చెర్రీ బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా రోజుల నుంచి అడవి శేషు సుప్రియ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇక రామ్ చరణ్ బర్త్ డే రోజు చాలామంది సినీ ప్రముఖులు ఆయన పుట్టిన రోజుకి హాజరయ్యారు. ఆ పుట్టినరోజు సందర్భంగా అడవి శేషు, సుప్రియ వీళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో ఈ పార్టీకి వచ్చారు. అలా ఒకేసారి వీళ్ళిద్దరూ కలిసి కారులో రావడంతో మీడియా కెమెరా కంట పడి వీళ్లిద్దరు అడ్డంగా బుక్ అయిపోయారు. దీంతో వీళ్లిద్దరి మధ్య కూడా ఎదో రిలేషన్ షిప్ నడుస్తుందని భావిస్తున్నారు..