Tamannaah Boyfriend: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఆమె మనందరికీ సుపరిచితమే.. టాలీవుడ్ లో స్టార్ హీరయిన్ గా ఎదిగి ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నిస్తుంది. ఇక ఆ కారణం చేతనే వచ్చిన అవకాశాలు వదులుకోకుండా బాలీవుడ్ లో నటిస్తుంది. ఐతే గత కొద్ది కాలంగా మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్యన ఏదో నడుస్తోంది అని, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని రక రకాలుగా వార్తలు ఐతే వచ్చాయి. అయితే ఈ విషయం గురించి తమన్నా కూడా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.. మా ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం నిజమే అంటూ కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించింది.
నిజ జీవితంలో ప్రేమికులుగా ఉన్న ఈ జంట ఇటీవలే కలిసి నటించిన చిత్రం లస్ట్ స్టోరీస్ 2.. తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రముఖ ఓటిపి ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 29వ తారీకు విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్ లు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తమన్నా తో కలిసి నటించడం పై ఎంతో ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. మొదట స్క్రిప్ట్ వినిపించే సమయంలో హీరోయిన్ పాత్రలో నటించేది ఎవరని అడిగానని.. తమన్నా అని చెప్పగానే నిజంగా అది సరైన ఎంపిక అనిపించింది. ఆ పాత్రకు ఆమె 100% కచ్చితంగా సెట్ అవుతృంది. తను నటించే పాత్ర ఏదైనా సరే చాలా లోతుగా ఆలోచిస్తూ.. శ్రద్ధగా వింటూ.. ఆ పని చేస్తుంది.
కేవలం ఆమె మాత్రమే ఆ పని చేయగలరు. ఇక మనతో నటించే సహనటులు ఉత్సాహంగా ఉంటే షూటింగ్ ఎంతో సరదాగా ఉంటుందని తెలిపాడు. నేను తమన్నా నటించిన బాహుబలి చిత్రం కూడా థియేటర్లో కెళ్ళి మరీ చూశాను. ఇక ఆమె ఇటీవలే నటించిన బిల్లీ బౌనన్స్ చిత్రం కూడా చూశాను. ఈ చిత్రాలలో ఆమె నటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. లస్ట్ స్టోరీ 2 చూశాక మీరు కూడా ఆమె నటనను కచ్చితంగా పొగిడేస్తారంటూ తెలిపాడు. తమన్నా మాత్రమే కాకుండా విజయ్ వర్మ (Tamannaah Boyfriend) కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి తెలియజేశాడు. మా మధ్య ఉన్న బంధం ప్రేమ బంధం అని తెలిపారు. ఇక ఇదే కాకుండా అసలు మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇన్ని రోజులు ఎందుకు దాచాల్సి వచ్చిందో కూడా బదులిచ్చాడు.
ప్రస్తుతం నా జీవితం అంతా ప్రేమమయమైంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ప్రజలకు కేవలం నా సిని లైక్ గురించే చెప్పాలనుకుంటున్నాను నా పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తానంటూ తెలిపాడు. అందువల్లే ఇన్ని రోజులు తమన్నాతో నా ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదని చెప్పాడు. విజయ్ వర్మతో తనకు ఉన్న బంధం గురించి ఇటీవలే తమన్నా బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.. లస్ట్ స్టోరీ 2 సెట్స్ మీదనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు వెల్లడించింది. ఇక వీళ్ళిద్దరూ కలిసి నటించి తొలి సారి స్కీన్ షేర్ చేసుకున్న వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారిందని వెల్లడించింది.