Hebah Patel: మనందరికీ తెలిసిన విషయమే.. అది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు వారి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్లుగా పేరు సంపాదించుకొని అగ్రస్థానంలోకి దూసుకుపోతుంటారు. ఇక మరికొందరైతే ఎన్ని సినిమాలు నటించినప్పటికీ స్టార్డం కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మరికొందరైతే మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ సాధించినప్పటికీ తదుపరి చిత్రాల్లో రాణించలేక చితకల పడిపోతుంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో నటన అందం తో పాటు లక్కు కూడా కలిసి రావాలి. అలాగే హెబ్బా పటేల్ కూడా తన మొదటి చిత్రంతోనే తన అంద చందాలతో నటనతో కుర్రకారులని హీటెక్కించింది.
ఈ విషయం మనందరికీ తెలిసిందే అప్పట్లో ఈ చిత్రం ఓ రేంజ్ లో సంచలనాన్ని సృష్టించింది కానీ ఆ తర్వాత హెబ్బా పటేల్ నటించిన ఏ చిత్రంలో కూడా ఇంతగా ఫేమ్ అవ్వలేదు.. ఇక కుమారి 21ఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా యూత్ ను ఆకర్షించిన హెబ్బా పటేల్ ఆ తర్వాత ఆడోరకం ఈడోరకం, 24 కిస్సెస్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, ఓదేలా రైల్వే స్టేషన్, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, ఏంజెల్, మిస్టర్ మొదలైనటువంటి చిత్రాల్లో నటించి ఎంతగానో అలరించింది. కానీ వీటన్నిటిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం కుమారి 21ఎఫ్ సినిమా మాత్రమే హెబ్బాకు తన స్థాయిని నిలబెట్టింది.
ఇక ఇటీవలే హీరోయిన్ గా ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. హెబ్బా త్వరలోనే పెళ్లికి సిద్ధమైందట.. అది ఎంతవరకు నిజమంటే ఈ పెళ్లికి సంబంధించిన వార్త రావడానికి ప్రధానమైన అటువంటి కారణం హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాలోనే వెల్కమ్ టు మై పెళ్లికూతురు ఫంక్షన్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. సరే పోస్ట్ పెడితే వేరే వాళ్లది అని మనం భావించవచ్చు.
అలాకాకుండా పెళ్లి కూతురుగా రెడీ అయి మరి నగలు వేసుకొని చీర కట్టుకొని ముస్తాబైన ఫోటోలు తన ఫోటోలు ఏకంగా షేర్ చేసింది. ప్రస్తుతం ఇవే ఫోటోలు చూసి చాలామంది నెటిజన్స్ ఆశర్యాన్నికి లోనవుతున్నారు. మరికొందరైతే ఎవరిని చేసుకోబోతున్నావు హెబ్బా అంటూ తెగ కామెంట్లు వర్షం కురిపిస్తున్నాడు. మరొకరు చిన్ననాటి స్నేహితుని చేసుకుంటున్నావు కాదు అంటూ అడుగుతున్నాడు. ఇక మరి ఈ విషయంపై హెబ్బా పటేల్ (Hebah Patel) ఎంత త్వరగా స్పందిస్తే ఈ వార్తలపై అంత త్వరగా క్లారిటీ వస్తుందని మనం ఎదురు చూడొచ్చు.