Home Cinema Shaakuntalam: అతని వల్లే శాకుంతలం సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుందా..!! ఇంతకు ఎవరు అతను.??

Shaakuntalam: అతని వల్లే శాకుంతలం సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుందా..!! ఇంతకు ఎవరు అతను.??

Shaakuntalam: శాకుంతలం (Shaakuntalam) సినిమాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి శాకుంతలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమై ఎన్నోసార్లు వాయిదా పడింది. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ఆగస్టులోనే విడుదల అవ్వాల్సి ఉండగా.. ఆ తేదీ మారుతూ ఏప్రిల్ 14వ తారీకు దేశవ్యాప్తంగా విడుదలవ్వనుంది. గతంలో ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేద్దామని చిత్ర యూనిట్ భావించినప్పటికీ ఏమైందో తెలియదు.. ఆ తర్వాత డేట్ కూడా మార్చేసి మొత్తానికి ఏప్రిల్ 14న విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.

See also  Keerthy Suresh: జాన్వీ కపూర్ మొగుడుతో అలాంటి స్థితిలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.

he-was-the-real-reason-behind-the-postponement-of-shaakuntalam-movie

ఇక ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో సమంత అభిమానులు ఇలా కావడానికి కారణం అక్కినేని కుటుంబం అంటూ వారిపై విమర్శలు చేశారు. ఇదే కాకుండా సమంత పై ఉన్న ద్వేషంతోనే నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి శాకుంతలం సినిమా విడుదల కాకుండా చేస్తున్నాడంటూ గతంలో చాలా వార్తలు ఎన్నో వచ్చాయి. ఇక సమంత ఆ సమయంలో ఎదుర్కొన్న అనారోగ్య ఇబ్బందుల కారణం చేత సినిమా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇదే కాకుండా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకు మూవీ అవుట్ పుట్ నచ్చకపోవడంతో మళ్లీ దీనిని మాడిఫై చేశారు అంటూ ఎవరికి నచ్చిన రాతలు వాళ్ళు కామెంట్ల రూపంలో తెలిపారు.

See also  KTR - Balagam : అసెంబ్లీలో బలగం సినిమా గురించి ఊహించని పాయింట్ చెప్పిన కేటీర్..

he-was-the-real-reason-behind-the-postponement-of-shaakuntalam-movie

వాస్తవానికి శాకుంతల (Shaakuntalam) సినిమా ఇన్నిసార్లు వాయిదా పడడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసింది.. ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడడానికి కారణం శిరీష్.. ఈయన వల్లే శాకుంతలం సినిమా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తుందని ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ తెలిపాడు. ఈ సినిమా మొదట చూసిన శిరీష్ ఈ చిత్రాన్ని 3Dలో తీస్తే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని మా అందరిని ఒప్పించాడంటూ గుణశేఖర్ తాజాగా మాట్లాడిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో మేము కూడా శిరీష్ చెప్పిన మాటలు విన్నాము. ఎందుకంటే ఆయన రోజు ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో తిరుగుతూ ఉంటాడు.

See also  Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

he-was-the-real-reason-behind-the-postponement-of-shaakuntalam-movie

కనుక ఆయన సినీ ప్రియులకు ఎలాంటి సినిమాలు కోరుకుంటాడు అనేది బాగా తెలుసు.. అందుకే కచ్చితంగా శకుంతల సినిమాను 3Dలోనే విడుదల చేయాలని పట్టుబట్టాడు. దాంతో మేమందరం కూడా సరే అన్నాము. ఇదే కారణం సినిమా ప్రతిసారి వాయిదాలు పడుతూ వస్తుంది అంటూ ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో గుణశేఖర్ తెలిపాడు. ఇక ఈ సినిమా 3D వెర్షన్ కోసం గత నవంబర్ నెల నుండి ఇప్పటివరకు వర్క్ మొత్తం పూర్తి చేశామని అందుకే ఇంత ఆలస్యమైందని తెలిపారు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీ బిజీ గా ఉంది.