Home Cinema Prabhas: ఆ హీరోయిన్ కెరియర్ ను డార్లింగ్ ప్రభాస్ ఇంతలా నాశనం చేశాడా.?

Prabhas: ఆ హీరోయిన్ కెరియర్ ను డార్లింగ్ ప్రభాస్ ఇంతలా నాశనం చేశాడా.?

Darling Prabhas: తెలుగు చిత్ర పరిశ్రమలో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఎటువంటి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన చాలా దూరంగా ఉంటాడు. ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ నిజంగా డార్లింగ్ అంటూ ఆయనని పొగుడుతుంటారు. కేవలం సినిమాలలోనే కాకుండా ప్రభాస్ ఓ గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అంటూ చెబుతుంటారు. ప్రస్తుతం అయితే తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడైతే చేతినిండా ప్రాజెక్టులతో చాలా బిజీబిజీగా తన లైఫ్ గడుపుతున్నాడు. అంతా బానే ఉంది.

has-darling-prabhas-ruined-that-heroines-life-so-much

కానీ.. ప్రస్తుతం ఒక వార్త బయటపడింది.. అదేంటంటే.. ప్రభాస్ ఓ హీరోయిన్ ని బాగా బాధ పెట్టాడట ఆమె కెరియర్ నాశనం చేశాడట.. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఇక ఈ బ్యూటీ జన్మించింది మన తెలుగు కుటుంబంలోని ఆయనప్పటికీ తమిళంలో కెరియర్ స్టార్ట్ చేయడమే కాక ప్రస్తుతం అక్కడ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరదే విధంగా కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ తానేంటో నిరూపించుకొని తన సత్తా చాటుతుంది. ఐశ్వర్య రాజేష్ ప్రధానమైన పాత్రలో తెరకెక్కిన చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నెల్సన్ వెంకటేశన్.

See also  Leo Review and Rating : లియో సినిమా రివ్యూ మరియు రేటింగ్..

has-darling-prabhas-ruined-that-heroines-life-so-much

ఈ చిత్ర విజయోస్తావ సందర్భంగా ఓ ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ కొన్ని సంచలనమైన విషయాలను తెలియజేసింది. నేను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ తెలుగులో అవకాశాలు రాలేదంటూ కుండ బద్దలు కొట్టే సమాధానం తెలిపింది. ఇలా మాట్లాడుతున్న తరుణంలో ప్రభాస్ కారణంగా నాకు అన్యాయం జరిగిందంటూ అందరికీ షాకిచ్చే న్యూస్ తెలిపింది. మరి అది ఎలా అంటే.. కోలీవుడ్లో ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా సూపర్ డూపర్ గా హిట్టు కొట్టింది. ఇక ఇదే సినిమాకు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ దక్కింది.

See also  Colors Swathi: మొగుడుని వదిలి మెగా హీరో తో పబ్లిక్ లో ముద్దులు.. మరి ఇలా రెచ్చిపోతుంది గా కలర్స్ స్వాతి..

has-darling-prabhas-ruined-that-heroines-life-so-much

కానీ ఇదే సమయంలో ప్రభాస్ (Darling Prabhas) చిత్రం సాహో విడుదల కావడం వల్ల మా సినిమాకు ఎంతో ఎదురు దెబ్బ పడిందని ఐశ్వర్య తన ఆవేదనను వ్యక్తం చేసింది. కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి క్రమక్రమంగా ఆడియన్స్ పెరుగుతున్న టైంలోనే ప్రభాస్ చిత్రం సాహో రావడంతో మా సినిమా మొత్తం పోయింది. దాంతో నేను చాలా బాధపడ్డానని.. కౌసల్య కృష్ణమూర్తి ఒకవేళ మంచి విజయం సాధించినట్లయితే నాకు తెలుగులో మరెన్నో అవకాశాలు లభించేవని కానీ అలా జరగలేదంటూ ఐశ్వర్య తెలిపింది. ఆ తర్వాత తెలుగులో ఐశ్వర్య పలు చిత్రాలు నటించినప్పటికీ అవి పెద్దగా విజయాన్ని అందుకోలేదు. దాంతో ఐశ్వర్యను తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోవడమే మానేశారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య రాజేష్ కెరియర్ ముగిసిపోవడానికి పరోక్షంగా ప్రభాస్ కారకుడయ్యాడట..