Home Cinema Hansika: క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తతోనే హన్సిక.. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు!

Hansika: క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తతోనే హన్సిక.. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు!

అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హన్సిక పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె అందం, నటన రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు దేశముదురు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈమెకు ఇంకా క్రేజ్ పెరిగింది. దానితో హన్సిక కి పెద్ద ప్రాజెక్ట్ సినిమాలలో నటించే అవకాశాలు బాగా వచ్చాయి. టాలీవుడ్ లోనే కాకుండా, కోలీవుడ్ లో కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ స్థానం దక్కింది.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుండగానే హన్సికకు పెళ్లయ్యింది. అక్కడ నుంచి ఆమె సినిమాలకు దూరం అవ్వడం కామన్ గా జరిగింది. హన్సిక పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు. హన్సిక క్లోజ్ ఫ్రెండ్ రింకీ బజాజ్‌ మాజీ భర్త. హన్సిక భర్త పేరు సోహైల్‌ కతూరియా.. ముంబై లో ఒక బిజినెస్ మాన్. సోహైల్‌ కతూరియా హన్సిక ని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇతని మొదటి భార్య అయిన రింకీ కి విడాకులు ఇచ్చారు.

See also  Nayanatara: నయనతార ఆమె భర్త పై పోలీస్ కేసు.. అసలు కారణం అదేనంట!

సోహైల్‌ కతూరియా రింకీల పెళ్ళికి అప్పట్లో హన్సిక కూడా వెళ్ళింది. ఎందుకంటే వాళ్లిద్దరూ హన్సికకి ఫ్రెండ్స్ కాబట్టి. కానీ పెళ్లి తరవాత సోహైల్‌ కతూరియా రింకీ లకు మనస్పర్థలు పెరిగి విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత సోహైల్‌ కతూరియా, హన్సికల మధ్య స్నేహం పెరిగి అది ప్రేమగా మారి, వాళ్లిద్దరూ ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు, ముఖ్యమైన ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

See also  Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

సోషల్ మీడియాలో హన్సిక తన అభిమానులకు అందుబాటులో ఉంటాది. హన్సిక అభిమానులు ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటె, చక్కగా సమాధానం చెబుతూ ఉంటాది. అయితే పెళ్లి తరవాత మీ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటని ఒక అభిమాని అడగగా.. లైఫ్ చాలా బాగుతుంది. ఇక పెళ్లి త‌ర్వాత మారింది ఇంటి అడ్రెస్‌` మాత్రమే అని చెప్పింది.