2000 rupees note: పెద్ద నోట్ల రద్దులో భాగంగా అప్పటి వరకు ఉన్న 1000,500 నోట్లకంటే పెద్ద నోటు అయిన 2000 రూపాయల నోటుని RBI తీసుకుని వచ్చింది. అప్పుడే రెండు వేల రూపాయల నోటు మీద అనేక విమర్శలు వచ్చాయి. ఇన్నాళ్లకి RBI రెండు వేల ( For changing 2000 Rupees ) రూపాయల నోటు ని ఉపసంహరించుకుని తిరిగి బ్యాంక్స్ లో డిపాజిట్ చేయమని ప్రజలకి చెప్పిన విషయం మనందరికీ తేలిందే. నోట్లు మార్చుకోవడం కోసం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చినప్పటికీ జనాలు బ్యాంక్స్ ముందు తండోప తండాలుగా క్యూ కడుతున్నారు.
ఈ మండు వేసవిలో క్యూ లో నిల్చోలేని వాళ్లు , తమ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లకి లెక్కలు సరిగా చూపలేని వాళ్లు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. అందులో ప్రధానమైనది గోల్డ్ కొనడం. నిజానికి రూల్స్ ప్రకారం రెండు లక్షల లోపు మాత్రమే క్యాష్ ట్రాన్సక్షన్ చేయాలి. అంతకు మించి అంటే త్రూ బ్యాంకు ధ్వారానే ( For changing 2000 Rupees ) అనగా చెక్ లేదా ఆన్లైన్ ట్రాన్సక్షన్ చేయాలి. కానీ మనోళ్లు గోల్డ్ షాప్ వాళ్లతో టైఅప్ అయ్యి, అక్రమమార్గంలో గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు. రెండు వేల రూపాయల నోటు రద్దు అయినప్పటినుండి గోల్డ్ షాప్ లో రెండు వేల నోట్ల కట్టలతో బంగారం కొనడానికి అన్ని ప్రముఖ నగల షాప్స్ లో జనాలు క్యూ కడుతున్నారు.
మరి రెండు లక్షల కి క్యాష్ ట్రాన్సక్షన్ జరిగిన లావాదేవీలని బంగారం షాప్ వాళ్లు ఎలా చూపుతారు? బ్యాంకు వాళ్లు బంగారం షాప్ వాళ్లు తీసుకుని వచ్చిన రెండు వేల రూపాయల నోట్లని లిమిట్ తో సంబంధం లేకుండా ( For changing 2000 Rupees ) ఎలా తీసుకుంటారు? ఇదే డబ్బు ఉన్న వాడు చేసే మాయ , అదే సామాన్యుడికి అయితే ఇంతే డిపాజిట్ చేయాలి, ఇలానే చేయాలి, ఇప్పటి లోపలే చేయాలి ఇలా అనేక నిబంధనలు. వీళ్లకి ఇవేవి వర్తించవు .. అందుకే నల్ల కుభేరులు ఇప్పుడు గోల్డ్ షాప్ ల వైపు పరుగులు పెడుతున్నారు. అసలే మన వాళ్ళు గోల్డ్ అంటే లక్ష్మి దేవి అని నమ్ముతారు.
నల్ల డబ్బుతో లక్ష్మీదేవిని కొని మళ్ళీ ఇంట్లో భద్రంగా పెడతారన్నమాట. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నల్ల డబ్బుని బయటకు లాగడానికి ఒక ప్లాన్ వేస్తే.. దానికి తగట్టు.. డబ్బున్నవాళ్ళు ఎలా డబ్బుని సేవ్ చేసుకోవాలో కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అందుకే ఈ 2000 నోటు రద్దు పై నెటిజనులు అనేక కామెంట్స్ పెడుతున్నారు. రెండువేల నోట్లు ఉన్నాయా? అయితే చలో గోల్డ్ షాప్ అంటూ సరదాగా కామెంట్స్ చేసుకుంటున్నారు. గోల్డ్ షాప్స్ తరువాత రియల్ ఎస్టేట్ సంస్థలు లో కూడా 2000 రూపాయల నోట్లను బాగా తీసుకుంటున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే 2000 నోట్లు బాగా ఎక్కువ ఉన్నవాళ్లు.. ఈ ఇద్దరు వ్యాపారసస్థులకు మంచి బిజినెస్ ఇస్తారన్నమాట!