Home Cinema Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది ....

Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది . .

fish-venkat-situation-went-down-so-bad-thanks-chiranjeevi-and-ram-charans-help

Fish Venkat : కమెడియన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారిలో ఒకరు ఫిష్ వెంకట్. పూర్తి స్థాయి రోల్స్ చేయకుండా కేవలం రౌడీ గ్యాంగ్ లో ఒకడిగా ఉంటూ ఇంత గుర్తింపుని సంపాదించడం చిన్న విషయం కాదు. ‘ఆది’ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇంటర్వెల్ లో ఊపుని ఇస్తూ తొడగొట్టు చిన్నా అంటూ ఫిష్ వెంకట్ పలికిన డైలాగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ డైలాగ్ తో గుర్తింపుని సంపాదించిన ఫిష్ వెంకట్ ఆ తర్వాత వరుసగా వీవీ వినాయక్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చేవాడు. అలా ఆడియన్స్ కి బాగా అలవాటు అయ్యాడు ఫిష్ వెంకట్. ఇక ‘గబ్బర్ సింగ్ ‘ చిత్రం ఫిష్ వెంకట్ తలరాతని మార్చేసింది అనే చెప్పాలి.

See also  Star Director: మెగస్టార్ చిరంజీవి గారినే ఎండలో రోజంతా నిలబెట్టిన ఆ స్టార్ డైరెక్టర్.? ఎవరో తెలుసా.?

అలా చురుకుగా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే ఫిష్ వెంకట్, ఈమధ్య సినిమాల్లో కనిపించడం లేదు. సడన్ గా ఏమైపోయాడు అని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లి అతనితో ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. రెండు కిడ్నీలు చెడిపోయాయని, షుగర్ కారణంగా దెబ్బ తగిలిన కాళ్ళు చర్మం మొత్తం ఊడిపోయింది అని, అందుకే వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ షూటింగ్స్ కి వెళ్లలేకపోతున్నానని, ప్రైవేట్ ఆసుపత్రి లో వైద్యం చేయించుకునే స్తొమత లేక గాంధీ ఆసుపత్రి లో చికిత్స చేయించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

See also  Samantha Dress: స‌మంత ధరించిన ఆ గ్రీన్ డ్రస్ ధర తెలిస్తే దిమాక్ కరాబే..

ఆయన దీనమైన స్థితిని చూసిన టాలీవుడ్ చలించిపోయింది. ఫిష్ వెంకట్(Fish Venkat) ఇంటికి వెళ్లి ఆర్ధిక సహాయం చేసారు. ఇక ఎవరికీ ఆపద వచ్చిన ముందుగా రెస్పాన్స్ ఇచ్చే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఫిష్ వెంకట్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘చిరంజీవి, రామ్ చరణ్ గార్లు మాత్రమే కాదు, టాలీవుడ్ అనేక మంది మొన్న జరిగిన ఇంటర్వ్యూ చూసి ఫోన్లు చేసారు.

See also  Prabhas: కృష్ణంరాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్.?

జీవితం లో ఎప్పుడూ చెయ్యి చాచి డబ్బులు అడగకూడదు అని అనుకున్నా. నాకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను ఒక్కరిని కూడా సహాయం కోసం డబ్బులు అడగలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నా బాగు కోసం ముందుకు వచ్చింది. మాటలు రావడం లేదు, ఆత్మాభిమానం నిండుగా ఉన్న నేను ఇలా నా చికిత్స కోసం ఒకరి డబ్బు మీద ఆధారపడడంని చూసి, నా నిస్సహాయతకు ఇదేమి కర్మ రా బాబు అని అనుకుంటున్నాను’ అంటూ ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.