Samyuktha Menon Hiked Remuneration: పవన్ కళ్యాణ్ మరియు రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయినా నటి సంయుక్త మీనన్ తన నటనతో మరియు అందానితో అందరిని మెప్పిచింది. ఆమె అప్పటి నుండి పట్టిందల బంగారమే అవుతుంది. నటి భీమ్లా నాయక్ తరువాత వరుస హిట్లు అందుకుంది. నటి సంయుక్త తన మొదటి సినిమాకు ముపై లక్షలు రెమ్యూనిరేషన్ గా తీసుకుంది. టాలీవుడ్ లో అది ఆమె డెబ్యూ సినిమా.
ఈ భామ తెలుగులో వరుస హిట్లు అందుకుంది, అందుకు గాను ఆమె తన రెమ్యూనరేషన్ పెంచేసింది. సంయుక్త ఇటీవల విడుదలైన సార్ సినిమాకు అక్షరాలా రెండు కోట్లు తీసుకుందట. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బారి విజయం అందుకుంది. ఆ తరువాత వచ్చిన విరూపాక్షకు కూడా ఆవిడ రెండు కోట్లు తీసుకుంది మరియు ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్టులకు ఆమె మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని డిమ్యాండ్ చేస్తుందట.
దీనితో ఆమెకు వచ్చే ఆఫర్లు కూడా తగ్గిపోయాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ మలయాళ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అని నమ్ముతున్నా, ఆవిడ రెమ్యూనరేషన్ పెంచడం ఆమె కరీర్ కు మంచిది కాదని క్రిటిక్స్ కోడై కూస్తున్నారు. సంయుక్త మీనన్ ప్రెసెంట్ తన రాబోయే సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది. ఆమె రెమ్యూనరేషన్ పై ఇంకా అధికారిక ప్రకటన లేన్నప్పటికీ, నిప్పులేనిదే పొగ రాదూ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. (Samyuktha Menon Hiked Remuneration)
సంయుక్త మీనన్ తమిళ్, మళయాళం మరియు తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె రెమ్యూనరేషన్ పెంచిన ఆమె హిట్స్ వాళ్ళ ఆమెకు వరుసగా సినిమా చెంసులు వస్తున్నాయి.ఏది ఏమయితేనేమి తన రాబోయే సినిమాలు కూడా హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు. (Samyuktha Menon Hiked Remuneration)