Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కి నట వారసుడిగా నిలబడిన సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అభిమానులందరికీ విపరీతమైన క్రేజ్. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగుపెట్టి.. తండ్రి తోను, తన అన్న రమేష్ బాబు తోను కలిసి కొన్ని సినిమాలు చేయడం ( Mahesh Babu has got a rare record ) జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తనలో ఉన్న ట్యాలెంట్ మొత్తం బయటపెట్టాడు మహేష్ బాబు. మహేష్ చిన్నప్పుడు నటించిన సినిమాలు అన్ని అప్పట్లో అందరిని ఆకట్టుకున్నాయి. పెద్దయిన తర్వాత హీరోగా అడుగుపెట్టి ప్రిన్స్ మహేష్ బాబు గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అతి తొందరలోనే స్టార్ హీరో అయిపోయి సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నాడు.
మహేష్ బాబు సినిమా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, నాగేశ్వరావు, చిరంజీవి ఇలాంటి వాళ్ళందరి మధ్యన కృష్ణ ఎటువంటి పెద్ద పెద్ద స్టెప్స్ వేయకుండా.. ఎలాంటి విపరీతమైన నటన చేయకుండా.. సూపర్ స్టార్ ( Mahesh Babu has got a rare record ) అయిన కృష్ణ.. నాలుగు డైలాగులు చెప్తే లేదా ఆయన అందం, వాక్ చాతుర్యం, ఆయన పర్సనాలిటీతో సినిమాని సక్సెస్ చేసేవారు. అయితే కృష్ణ కంటే ఇంకా సుకుమారంగా అసలు పెద్దగా డైలాగే చెప్పకుండా చిన్న చిరునవ్వు, చిన్న మాట మాట్లాడినా కూడా క్రేజ్ సంపాదించుకున్న హీరో మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా అంటేనే ఒక కొత్తదనం ఆయన నటనలో ఒక వినూత్నం కనిపిస్తాది.
ఇప్పుడు మహేష్ బాబు రెమ్యూనరేషన్ కనీసం 80 కోట్లు ఉంటుందని వార్తలు అయితే వస్తున్నాయి. 80 కోట్ల రెమ్యూనరేషన్ కి వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మామూలు విషయం కాదు. అనేక అద్భుతమైన సినిమాలను చేసి తనకంటూ ఒక స్టేజి క్రియేట్ చేసుకున్న మహేష్ బాబుకి.. ఇంకొక అరుదైన రికార్డు కూడా సొంతమైతే ( Mahesh Babu has got a rare record ) అది మహేష్ బాబు ఒక్కడికే సొంతం అవడం ఇంకా ఆనందదాయకంగా ఉంది. సాధారణంగా సినిమాలు స్టార్ హీరోల భారీ బడ్జెట్లో సినిమా తీస్తారు. కాబట్టి సినిమా కథతోని అది ఆడియన్స్ కి నచ్చిందా లేదా అనే రిస్క్ ని బేర్ చేయకుండా రీమేక్ సినిమాలు చేస్తూ ఉంటారు. రీమిక్స్ సినిమా వలన ఉన్న ఉపయోగం అదే గ్యారెంటీ సక్సెస్ అనే ఆలోచనలో ఉంటారు. కానీ మహేష్ బాబు కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గది ఉంది.
అదేంటంటే.. మహేష్ బాబు ఇంతవరకు ఒక్క రీమిక్స్ సినిమా కూడా చేయలేదు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పెద్దపెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా ఏదో ఒక రీమేక్ సినిమా చేస్తూనే ఉన్నారు కానీ.. మహేష్ బాబు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. రీమేక్ సినిమా చేయకపోవడానికి కూడా కొందరికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆల్రెడీ జనాలకు తెలిసిన కథ అవ్వడం వలన లేదా కొత్త కథని పరిచయం చేయాలి, కొత్త పాయింట్ కి వెళ్ళాలి అనుకోవడం లేదా కంపారిజన్ చేస్తూ సినిమా చూడటం వలన నచ్చకపోవడం ఇలాంటి కారణాలు ఏమైనా కావచ్చు గాని.. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇప్పటివరకు రీమేక్ సినిమా అతని కెరీర్ లో లేకుండా కూడా.. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతూ నిలబడటం అంటే నిజంగా మహేష్ బాబుని అభినందించాలి. వాళ్ళ హీరోకి దక్కిన అరుదైన రికార్డుకి మహేష్ బాబు అభిమానులు అందరూ ఆనంద పడిపోతున్నారు.