Home Cinema Ram Charan: యాక్టింగ్ రాదని రామ్ చరణ్ ని ఎక్కిరించారు.. కానీ ఆస్కార్ అవార్డు...

Ram Charan: యాక్టింగ్ రాదని రామ్ చరణ్ ని ఎక్కిరించారు.. కానీ ఆస్కార్ అవార్డు కొట్టి సత్తా చూపించాడు..

Ram Charan Oscar: చిరంజీవిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో ఆయన కొడుకు చరణ్ కూడా ఇండస్ట్రీలో చిరుత సినిమాతో 2007లో తన కెరీర్ ప్రారంభించి, తండ్రికి తగ్గ తనయుడుగా తన రెండవ చిత్రం మగధీరతో తనెంటో నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ మార్చి 27న 1985లో జన్మించాడు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఓ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. లక్షల్లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

even-though-ram-charan-was-accused-of-not-acting-he-won-the-oscar-and-showed-his-strength

ఇక ఆ తర్వాత ఓ లవ్ స్టోరీ ఆరెంజ్ సినిమాతో అలరించేందుకు ప్రయత్నించాడు చెర్రీ. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవడంతో చెర్రీకి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా తర్వాత తనతో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదట. ఆ తర్వాత సంపత్ తనకు రచ్చ సినిమాతో అవకాశం కల్పించడంతో మళ్లీ రామ్ చరణ్ అసలు కథ ఇక్కడ నుండి మొదలైంది. అలా నాయక్, ఎవడు చిత్రాల్లో నటించిన రామ్ చరణ్ కమర్షియల్ గా విజయం వరించినప్పటికీ.. తనేంటో నిరూపించుకోలేకపోయాడు.

See also  Amitabh Bachchan : క్రికెట్ పై అమితాబ్ అలాంటి ట్వీట్ చేయడానికి అసలు కారణం అదేనట..

even-though-ram-charan-was-accused-of-not-acting-he-won-the-oscar-and-showed-his-strength

ఇక హిందీలో ప్రియాంక చోప్రా సరసన జంజీర్ అనే సినిమాలో చేసిన చెర్రీ తెలుగులో అదే సినిమా తుఫాన్ అనే పేరుతో విడుదలైంది. ఆ మూవీ అతిపెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది తనకు యాక్టింగ్ రాదని, చరణ్ ఫేస్ లో కలలేదని రకరకాల కామెంట్స్ చేసారు. ఇక ఆ తరువాత కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన గోవిందు అందరివాడు చిత్రం కూడా చెర్రీకి పెద్దగా కలిసి రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ, దృవ సినిమాలు చరణ్ ను నిలబెట్టాయి. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీలో యాక్టింగ్ అదరగొట్టిన చెర్రీ తనెంటో ఇండస్ట్రీకి మరొకసారి చూపించగలిగాడు.

See also  Geetha Madhuri : గీత మాధురి ఆ భయంకరమైన కారణంగానే నందుకు విడాకులు ఇస్తుందా?

even-though-ram-charan-was-accused-of-not-acting-he-won-the-oscar-and-showed-his-strength

ఇక సెట్ అయ్యాడు అనుకుంటే మళ్ళీ వినయ విధేయ రామ సినిమాతో అందరినీ నిరాశపర్చినప్పటికీ, ఎన్టీఆర్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందించినటువంటి RRR చిత్రంతో అసలైన మెగా పవర్ స్టార్ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఈ చిత్రం కోట్ల మంది మనుసులు గెలుచుకొని రాష్ట్రాల, దేశాలు, ఖండాంతరాలు దాటి ఈ చిత్రం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాటగాను ఇటీవలే ఆస్కార్ అవార్డు (Ram Charan Oscar) అందుకోవడంతో ఇప్పుడు రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయింది.