Uday Kiran : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక యంగ్ హీరోగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే.. మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఎంత తొందరగా పైకి వచ్చాడో.. అంత తొందరగా అందరిని వదిలి చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఉదయ్ కిరణ్ (Do you know who was that person not agree for Uday Kiran act like a hero? ) సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు. ఉదయ్ కిరణ్ ని సినిమా ఇండస్ట్రీకి దర్శకుడు తేజ పరిచయం చేసారు. చిత్రం సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఉదయకిరణ్. బాల నటుడిగా గాని ఎలాంటి అనుభవం లేకుండానే ఆ సినిమాలో చాల బాగా నటించాడు.
అతి తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే.. ఉదయ్ కిరణ్ ని మెగాస్టార్ చిరంజీవి కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి ఆ కుటుంబం ముందుకు వచ్చింది. అంటే అది మామూలు విజయం కాదు. చిరంజీవిని అల్లు రామలింగయ్య ఎలా సెలక్ట్ చేసుకున్నాడో.. ఉదయ్ కిరణ్ ( Do you know who was that person not agree for Uday Kiran act like a hero? ) ని చిరంజీవి అలా సెలెక్ట్ చేసుకున్నాడని అప్పట్లో అందరూ అనుకునేవారు. అంటే ఉదయ్ కిరణ్ ని భవిష్యత్తులో మరో మెగా స్టార్ అని అప్పట్లో సినీ అభిమానులు అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.చిరంజీవి అంత హీరో కాలేకపోయినా కూడా కనీసం చిరంజీవిగా జీవించలేకపోయాడు.
అసలు ఉద్య కిరణ్ హీరో అవ్వకుండా ఉండటానికి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డు పడ్డారని అంటారు. ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు రామోజీ రావు. ఇతనికి ఉదయ్ కిరణ్ కి సంబంధం ఏమిటి? ఆయన ఎందుకు ఉదయ్ కిరణ్ ని హీరో అవ్వనివ్వరూ అని అనుకుంటున్నారా? ఉదయ్ కిరణ్ మొదటి సినిమా అయిన చిత్రం సినిమాకి ప్రొడ్యూసర్ రామోజీరావు. ఆ సినిమాలో కొత్త హీరోని పెట్టాలని తేజ ఎందరినో వెతుకుతుంటే ఎవ్వరూ నచ్చలేదు. లాస్ట్ కి దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ని హీరోగా సెలెక్ట్ చేసారంట. అయితే చిత్రం సినిమాకి రామోజీరావు ఇచ్చిన బడ్జెట్ కేవలం 40 లక్షలు అంట.
అందులో హీరో రెమ్యునిరేషన్ 11000 రూపాయలు మాత్రమే. ఆ రెమ్యునిరేషన్ కి ఉదయ్ కిరణ్ నటించడానికి ఒప్పుకోలేదట. పైగా ఉదయ కిరణ్ ని ఆ సినిమాలో హీరోగా పెట్టుకోవడం రామోజీ రావు కి ఇష్టం లేదంట. ఎవరైనా బాల నటుడిగా నటించిన హీరోని పెట్టుకోవాలని ఉండేదంట . అందుకే ఉదయ్ కిరణ్ కి 11000 మించి ఇవ్వను అన్నారంట. చివరి వరకు చూసి.. తేజ కి ఎవ్వరూ నచ్చక కేవలం ఉదయ్ కిరణ్ కావాలని రామోజీ రావు ని ఒప్పించి కొంచెం రెమ్యునిరేషన్ పెంచి సినిమా స్టార్ట్ చేసారంట. ఉదయ్ కిరణ్ హీరో కాకుండా ఉండి ఉన్నా.. ఎక్కడో ఒకచోట ఉద్యోగం చేసుకుని బ్రతికి ఉండును అని అనిపిస్తుంది..