Home Cinema Deshamuduru: బ్లాక్ బస్టర్ సినిమా దేశముదురును వదులుకున్న దురదృష్టమైన హీరో ఎవరో తెలుసా.?

Deshamuduru: బ్లాక్ బస్టర్ సినిమా దేశముదురును వదులుకున్న దురదృష్టమైన హీరో ఎవరో తెలుసా.?

Deshamuduru: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో చిత్రాల్లో నటించాడు కాగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దేశముదురు చిత్రం ఒకటి. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది డైనమిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్. కాగా.. ఈ చిత్రంలో యాపిల్ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వాళ్లు ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, అజయ్, తెలంగాణ శకుంతల.. మొదలైన వారు ఈ చిత్రంలో మంచి పాత్రలను పోషించారు.. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డీ.వి.వి దానయ్య నిర్మించినటువంటి ఈ చిత్రం 2007వ సంవత్సరం జనవరి 12వ తారీకున విడుదలై సంచలమైనటువంటి ఘన విజయాన్ని కైవసం చేసుకుంది.

See also  Dhanush : ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం అదా?

do-you-know-who-is-the-unlucky-hero-who-rejected-a-blockbuster-movie-like-deshamuduru

ఇక అల్లు అర్జున్ నటించిన చిత్రాలలో బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన బద్దలు కొట్టే వసూలను రాబట్టిన ఏకైక చిత్రంగా దేశముదురు నిలిచింది. ఇక ఈ చిత్రం కోసం చక్రి అందించిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ బంపర్ హిట్ గా నిలిచాయి. ఇక అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ తో నటించిన ఈ చిత్రంతో అప్పట్లో ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇదే కాకుండా ఈ మూవీతో సినీ పరిశ్రమలో మొట్ట మొదటి సిక్స్ ప్యాక్ యాప్స్ పెంచిన తొలి హీరోగా అల్లు అర్జున్ అప్పట్లో రికార్డును సృష్టించాడు. ఇక ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ దశ దిశ మారిపోయిందనే చెప్పాలి.

See also  Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.. చివరికి అతని రియాక్షన్ ఏమిటంటే..

do-you-know-who-is-the-unlucky-hero-who-rejected-a-blockbuster-movie-like-deshamuduru

మరి ముఖ్యంగా ఈ చిత్రంలో పూరి మార్క్ డైలాగ్స్ ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి. కాగా చాలా కొద్ది మందికి తెలిసిన విషయం ఉంది. అదేంటంటే.. ఫస్ట్ సినిమా పూరి జగన్నాథ్ అనుకున్నది దేశముదురు చిత్రం అల్లు అర్జున్ తో కాదట.. మరెవరితో అనుకుంటున్నారో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ యార్లగడ్డతో.. దేశముదురు చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడట. ఇక అప్పట్లోనే సుమంత్ హీరోగా మంచి ప్రయత్నాలు చేస్తూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి.. దాంతో అదే సమయంలో పూరి జగన్నాథ్ సుమంత్ వద్దకు వెళ్లి దేశముదురు స్టోరీని లైవ్ లో వినిపించసాగాడు.

do-you-know-who-is-the-unlucky-hero-who-rejected-a-blockbuster-movie-like-deshamuduru

ఇక హీరో సన్యాసిని ప్రేమిస్తాడు.. అంటూ తన స్టోరీని మొదలు పెట్టగానే ఏమైందో తెలియదు సుమంత్ కి ఈ స్టోరీ అంతగా మాత్రం ఆకట్టుకోలేక పోయిందట. దాంతో వెంటనే నీ చిత్రాన్ని చేయనని నో చెప్పేసాడట. ఇక ఆ తర్వాత పూరి బాగా ఆలోచించి ఎవరితో చేస్తే బాగుంటుంది అని పూర్తి స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ సంప్రదించాడంట. ఇక ఆయన వెంటనే ఓకే చెప్పేసాడు. అలా పట్టాలెక్కేసిన దేశముదురు (Deshamuduru) ఫటా ఫటా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ జీవితంలోనే అత్యధిక వసూళ్లు రావట్టిన చిత్రాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. మొత్తానికి ఇంత అద్భుతమైన సూపర్ చిత్రాన్ని మిస్ చేసుకున్నటువంటి అన్ లక్కీ హీరోగా సుమంత్ నిలిచిపోయాడు.