Home Cinema Ninnu Kori Movie: నాని పొట్టోడంటూ నిన్ను కోరి సూపర్ హిట్ చిత్రం వదులుకున్న ఆ...

Ninnu Kori Movie: నాని పొట్టోడంటూ నిన్ను కోరి సూపర్ హిట్ చిత్రం వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

Ninnu Kori Movie: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా రాణించగలగడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి వాళ్లు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది మంది ఉన్నారు. ఇక అలాంటి వాళ్ళలో హీరో నాని కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత అనుకోకుండా హీరోగా మారిపోయాడు నాని. అలా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతూ నేచురల్ స్టార్ గా ఎదిగిపోయాడు.  ప్రస్తుతం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలే దసరా చిత్రంతో పాన్ ఇండియాలో బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకున్నాడు నాని. ప్రస్తుతం హయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ చాలా బిజీ బిజీగా తన సినీ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇక ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి నాని కెరియర్ లో సూపర్ హిట్ కొట్టిన సినిమాలలో ఒకటి నిన్ను కోరి.

See also  Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి!

Nani Ninnu Kori Movie

ఇక ఈ చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి మెచ్యార్డ్ లవ్ స్టోరీ. ఇక ఈ చిత్రాన్ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య గారు నిర్మించారు. ఇక ఇందులో హీరోగా నాని హీరోయిన్ నివేద థామస్ నటించగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించ సాగాడు. ఇక వీళ్లే కాకుండా మురళీ శర్మ, పృధ్విరాజ్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈ చిత్రానికి గోపి సుందర్ గానాన్ని అందించాడు.

Nani

2017 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. రొటీన్ లవ్ స్టోరీ చిత్రంలా ఉండకుండా కొంత డిఫరెంట్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్టర్ శివరనిర్వాణ గారు ఎంతో చక్కగా ఈ ఈ చిత్రాన్ని చెక్కారు. ఇక ఈ చిత్రంలో నాని నివేదా థామస్ మరియు ఆది పినిశెట్టిలు పోటా పోటీగా తన నటన ప్రతిభను కనబరిచారు. ముగ్గురు తగ్గేది లే అంటూ పోటా పోటీగా వాళ్ళని యాక్టింగ్ తో ఈ చిత్రాన్ని మరొక లెవెల్ ని ప్రజెంట్ చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే 18 కోట్లతో తరికెక్కినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వస్తుందని కొల్లగొట్టింది.

See also  Jabardast Contestant: బిగ్ బాస్ గురించి అంతా తెలిసి మరీ అందులోకి అడుగుపెట్టబోతున్న జబర్ధస్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా.?

Kajal Aggarwal

కాగా అసలు మన టాపిక్ విషయంలోకి వస్తే.. ఈ చిత్రంలో (Ninnu Kori Movie) హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ నివేదా థామస్ కాదట మరి ఎవరనుకున్నారు.? హీరోయిన్ రోల్ కోసం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ని మొదట సంప్రదించారట. ఆమెకు కథ నచ్చినప్పటికీ సింపుల్ గా రిజెక్ట్ చేసిందటస అందుకు కారణం ఏంటని అడగ్గా.. నాని హైట్ ఏ అంటూ చెప్పిందట. సాధారణంగా నాని కొంచెం పొట్టిగా కనిపిస్తుంటాడు ఆ కారణంగానే కాజల్ కు కథ నచ్చినప్పటికీ నాని పొట్టిగా ఉంటాడు స్క్రీన్ పై మా ఇద్దరి జోడి అంతగా సెట్ అవ్వదు అంటూ కాజల్ నిన్ను కోరి చిత్రాన్ని కోరుకోలేదట. ఆ తర్వాత సమంత దగ్గరికి వెళ్ళగా ఆమె ఏవేవో కారణాలు చెప్పి డేట్స్ కుదరడం లేదంటూ ఆమె కూడా సున్నితంగా తిరస్కరించిందట. ఇక చివరకు మేకర్స్ ఎవరా అని ఆలోచిస్తుండగా నివేదా థామస్ ని హీరోయిన్ గా పట్టుకొచ్చారట.