Tamanna For Free: మిల్కీ బ్యూటీ తమన్న గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న హీరోయిన్ అలాంటి ఆమె గురించి ప్రత్యేకించి పరిచయాలు ఏముంది చెప్పండి. అందంలో తనకు తానే పోటీ తనకు లేరెవరు సాటి అంత తెల్లగా నిగనిగలాడిపోతుంది కనుక ఈ అమ్మడు మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. నటన పరంగా డాన్స్ పరంగా అదరగొట్టేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని కాపాడుకుంటూ రెండు దశాబ్దాల పాటు మన తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ గా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తుంది. ఎంత మంది హీరోయిన్లు వస్తున్న కొత్త హీరోయిన్లు అడుగు పెడుతున్న కుర్ర హీరోయిన్లకు దీటుగా ఎలాంటి ఫామ్ కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ పలు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ తన సత్తాను చాటుకుంటూ వస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా..
ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. తమన్నాకు గతంలో ఓ స్టార్ హీరో కోట్లు విలువ చేసే ప్లాట్ ను ఫ్రీగా ఇచ్చేశాడట. మరి ఆ హీరో ఎవరనుకుంటున్నారు.? మరెవరో కాదు 2010లో తమన్నా కార్తి జంటగా ఆవారా అనే సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా తెలుగులో సైతం కార్తీక్ మంచి హీరోగా క్లిక్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే హీరో కార్తీ తమన్నాల మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందట. ఇక వీళ్లిద్దరు మంచిగా క్లోజ్ గా అయ్యారట. ఇదే క్రమంలో చెన్నైలో కార్తీక్ తమన్నాకు ఖరీదైన ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చాడని.. అప్పట్లో కోలీవుడ్ మీడియాలో విపరీతమైన హాట్ టాపిక్ గా మారి వైరల్ అయింది.
అయితే ఇక ఈ విషయాలు ఎంత వైరల్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ పట్టించుకోకుండా అదే ఫ్లాట్లో కార్తీక్ తమన్నా కలిసి ఉండడం మొదలు పెట్టారట.. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి కార్తీ తండ్రి ప్రముఖ నటుడు శివ కుమార్ కి తెలిసిందట.. అప్పటికే పెద్ద కొడుకు సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మళ్ళీ చిన్న కొడుకు కూడా ఓ హీరోయిన్ ఇంటికి కోడలుగా తీయడం శివ కుమార్ కి ఏ మాత్రం ఇష్టం లేదట.. ఇక ఆ కారణం చేత తమన్నా వల్ల కార్తీ ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గ్రహించిన కార్తి చేసేది ఏమీ లేక తమన్నాకు బ్రేకప్ చెప్పాడట.
వెంటనే తన తండ్రి ఇష్టం మేరకు 2011 వ సంవత్సరంలో దగ్గరి బంధువుల అమ్మాయి అయిన రజినీతో పెళ్లి పీటలు ఎక్కేశాడు. ఇక ఆ తర్వాత కార్తితో విడిపోయిన కొద్ది రోజులకి తీవ్ర మనస్థాపానికి గురైన తమన్న మళ్ళీ తన సినీ కెరియర్ పై మంచి ఫోకస్ పెట్టడం మొదలు పెట్టిందట.. అలాగే కార్తి ఇచ్చిన ఫ్లాట్స్ అయితే అతనికి ఇచ్చేయాలని నిర్ణయించుకుందట.. కానీ కార్తీ ఆ ఫ్లాట్ ను తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదట. ఇప్పటికే చెన్నైలో తమన్న (Tamanna For Free) పేరిట ఫ్లాట్ ఉందని టాక్ అయితే మనకు వినిపిస్తుంది. అయితే ఇటీవలే తమన్న బాలీవుడ్ నటుడు విజయ వర్మతో పీకల్లోతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే వీళ్ళ ప్రేమ విషయాన్ని స్వయంగా వీరిద్దరూ బయట పెట్టగానే పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలిపారు.