Home Cinema Richest Heroine: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Richest Heroine: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Richest Heroine: సినిమా ప్రపంచంలో ఇప్పటికీ కూడా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీ లోనే కాదు నార్త్ ఇండస్ట్రీ లో కూడా లేనే లేరు.. కానీ చాలా మంది హీరోయిన్లు మంచి స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించినప్పటికీ కూడా హీరోలు తీసుకునేంత రెమ్యూనరేషన్ మాత్రం పుచ్చుకోలేకపోతున్నారు. చాలా మంది హీరోయిన్లు సినిమాలలో పూర్తి రన్ టైంలో నటించినప్పటికీ అందరి హీరోయిన్ లకి ఇప్పటి వరకు ఒకేలా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉండడం గమనిస్తూనే ఉన్నాం . స్క్రీన్ టైమింగ్ నుంచి రెమ్యూనరేషన్ వరకు భారీ స్థాయిలో తేడా కనిపిస్తూనే ఉంటుంది.

do-you-know-who-is-the-richest-heroine-in-south-film-industry

ఇక ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదు. కానీ కొద్ది మొత్తంలో మార్పు మాత్రం మనకి లభించింది అని చెప్పాలి.. కొంత మంది హీరోయిన్లు హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. హీరోలు లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల లో నటిస్తూ సూపర్ డూపర్ హిట్లు వాళ్ల ఖాతాలో వేసుకుంటున్నారు. అలా రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే గట్టిగా పుచ్చుకుంటూ కోట్లు గడిస్తున్నారు. మరి అలా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ల లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఎవరో తెలుసా? మరెవరో కాదండి.. లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార. (Richest Heroine)

See also  Samantha : సూసైడ్ అటెంప్ట్ చేసిన సమంత.. ట్వీట్ చూసి ఏడ్చేసిన చైతు..

do-you-know-who-is-the-richest-heroine-in-south-film-industry

అవును ప్రస్తుతం సౌత్లో ఉన్న హీరోయిన్ అందరిలో చాలా ధనికురాలిగా ఉన్న హీరోయిన్ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది నయనతార. ఇక ఆమె ఆస్తులన్నీ కలిపి దాదాపు 165 కోట్ల రూపాయలు ఉండనుందట.. ప్రస్తుతం నయనతార ఒక్క సినిమాకి ఏ హీరోయిన్ తీసుకోలేనంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. ఇక ఆమె ప్రస్తుతం ఒక సినిమాకి 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట.. ఇక అమ్మడు త్వరలోనే బాలీవుడ్ లోకి సైతం షారుక్ ఖాన్ సరసన నటించేందుకు బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇది నయనతార నటిస్తున్న తొలి హిందీ చిత్రం జవాన్. ఇక ఈ చిత్రంలో హీరోగా షారుఖ్ ఖాన్ నటిస్తుండగా దర్శకత్వం వహిస్తుంది అట్లీ..

See also  Baby Heroine : ఆ స్టార్ హీరో బేబీ హీరోయిన్ ని పిలిచి మరి ఏమన్నాడో తెలిస్తే మతిపోతుంది.

do-you-know-who-is-the-richest-heroine-in-south-film-industry

నయనతార తర్వాత ధనవంతురాలిగా రెండవ స్థానంలో కొనసాగుతుంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావునప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చివరికి బాలీవుడ్ లో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకొని ప్రస్తుతం రెమ్యూనరేషన్ గట్టిగానే ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఆమె దాదాపు 110 కోట్ల విలువ చేస్తే ఆస్తులను మూటగట్టిందట ఇప్పటి వరకు.. ఇక ఆ తర్వాత 100 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను సంపాదించి అనుష్క శెట్టి మూడవ స్థానంలో కొనసాగుతుంది. 90 కోట్ల ఆస్తులుతో ప్రస్తుతం నాలుగో స్థానంలో సమంత నిలువగా.. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక మందన మొదలైన వారు ఉన్నారు.