Do you know which heroine crushed Kamal Haasan : కమల్ హాసన్ ( kamal haasan ) సినిమా అంటే అన్ని వయసుల వారికీ ఇష్టమే. ఆయన సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భరతనాట్యం కమలహాసన్ చేసినంత బాగా, హీరోయిన్స్ కూడా చేయలేరు. ఆయన పక్కన ఎంతటి హీరోయిన్ ఉన్నా.. కమల్ హాసన్ మీదకే దృష్టి వెళ్తుంది. ఆయన పెర్ఫామెన్స్ అంతగా బాగుంటుంది. సాగరసంగమం సినిమా భారతదేశం గర్వంగా చెప్పుకోతగ్గ సినిమాగా మిగిలింది. భారతీయుడు ఇలా ఎన్నో సినిమాలలో ప్రత్యేకంగా కనబడుతూ.. ఎలాంటి పాత్రకైనా ఆయన నటనతో జీవం పోస్తారు. ఆయన సరసన నటించే అవకాశం దొరకడం అదృష్టంగా హీరోయిన్స్ భావిస్తారు. అలాంటి కమల్ హాసన్ గురించి హీరోయిన్ ఆమని ( Aamani ) రీసెంట్ గా అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలను చెప్పింది.
జంబలకడిపంబ సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆమని పరిచయం అయ్యింది. ఆమె నటించిన మొదటి సినిమా వినడానికి, చూడటానికి విచిత్రంగా ఉన్నా కూడా సినిమా మాత్రం హిట్ అయ్యింది. నరేష్ హీరోగా, ఆమని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారడం పై తీసిన ఈ సినిమా ఆరోజుల్లో, ఆడియన్స్ తెగ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఆ సినిమా తరవాత ఆమనికి అనేక సినిమాలలో అవకాశం వచ్చింది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఈమెకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా లో కూడా భర్త కంటే భార్య ఎందులోనూ తక్కువ కాదు అనే కాన్సెప్ట్ తో ఎంతో అనుకువగా చక్కని ఇల్లాలిగా నటించింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఆమని జగపతిబాబుతో కలసి నటించిన శుభలగ్నం సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఈమె నటన చాలా బాగుంటుంది. సగటు మధ్య తరగతి ఇల్లాలికి ఎలాంటి ఆశలు ఉంటాయి, అవి తీరకపోతే, ఆశ ఎక్కువ అయితే ఏమౌతాది అనే ఈ సినిమాలో ఆమని పాత్ర అందరిని ఆకట్టుకుంది. అలాంటి పాత్రని ఆమని అంత అద్భుతంగా నటిస్తుందని ఊహించలేకపోయారు. అలాగే మావిచిగురు సినిమా కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రతీ పాత్రలో తాను నిజంగా జీవించేలా నటించే ఈ హీరోయిన్, పెళ్లి కాగానే సినిమాలకు దూరం అయ్యింది. కొంతకాలం తరవాత మల్లి సినిమాల్లో అక్కగా, అమ్మగా నటించడం స్టార్ట్ చేసింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమని మాట్లాడుతూ.. కమల్ హాసన్ (which heroine crushed Kamal Haasan ) గురించి మాట్లాడింది. ఆమని కమల్ హాసన్ కి హీరోయిన్ గా శుభసంకల్పం సినిమాలో నటించింది. కళాతపశ్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా ఆమనీ పాత్ర చాలా బాగుంటుంది. అమాయకంగా ఉండే ఆమె పాత్ర ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. అయితే ఇంటర్వ్యూలో ఆమనీ మాట్లాడేటప్పుడు ఈ సినిమాలో కమల్ హాసన్ ని కొట్టాల్సిన సీన్ వచ్చింది. నాకు ఎవరినైనా కొట్టే సీన్ అంటే చాలా ఇష్టం అందులో నిజంగా లీనం అయిపోతాను. అందుకే కమల్ హాసన్ ని నిజంగా కొట్టాను, దానికి ఆయన షాట్ అయిన తరవాత.. డైరక్టర్ కొట్టమన్నారని అలా నిజంగా కొట్టకూడదు, నటించాలి అని చెప్పారు. లేదు ఇలాంటి సీన్స్ నేను ఫీల్ అవుతూ ఇలానే చేస్తాను అని చెప్పాను అని చెప్పింది. అప్పటి నుంచి సినిమాల్లో ఎవర్ని కొట్టాల్సి వచ్చినా ఆమని కి మాత్రం కమల్ హాసన్ గుర్తుకు వస్తారంట.