Home Cinema Blockbuster movie: రామ్ చరణ్ సాయి పల్లవి కాంబినేషన్ లో చేజారిన ఆ బ్లాక్ బస్టర్...

Blockbuster movie: రామ్ చరణ్ సాయి పల్లవి కాంబినేషన్ లో చేజారిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా.?

Blockbuster movie: మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో మన తెలుగులో ఓ చిత్రం విడుదలయితే అస్సలు ఆ ఊహకి హద్దే ఉండదు ఎంత బాగుంటుందో కదూ.. ఇక ఇలాంట మంచి జోడి క్రేజీ కాంబినేషన్ లో ఓ చిత్రం రావాలని చాలామంది అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటూనే ఉన్నారు. కానీ అలాంటి తరుణం వాళ్ళ కోరిక తీరడం ఇప్పట్లో కనిపించేలా అస్సలు లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే.. గతంలో రామ్ చరణ్ సాయి పల్లవి కాంబినేషన్లో జస్ట్ మిస్ అయిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ వీళ్ళిద్దరూ కలిసి నటించకుండా చేజారిపోయింది. మరి ఆ బ్లాక్ బాస్టర్ మూవీ మరేదో కాదు. ఫిదా..

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేసింది నిజంగా అంత తప్పా..

do-you-know-what-is-the-blockbuster-movie-of-ram-charan-sai-pallavi-combination

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించినటువంటి ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రంలో సాయిచంద్, శరణ్య ప్రదీప్, సత్యం రాజేష్, రాజా చెంబోలుఅ మొదలైన వారు కీలక పాత్రలో నటించ సాగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా 2017 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి తనదైన శైలిలో మంచి రెస్పాన్స్ ని ఆకట్టుకుంది.

do-you-know-what-is-the-blockbuster-movie-of-ram-charan-sai-pallavi-combination

బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ను కైవసం చేసుకుంది. ఇక సాయి పల్లవి తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇది. సాయి పల్లవి మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ భానుమతి పాత్రలో అచ్చ తెలుగు ఆడ పిల్లలా అందరి మనసులు కొల్లగొట్టి సాయి పల్లవి అదరగొట్టేసింది. అయితే అసలు ఈ చిత్రంలో హీరోగా మొదట అనుకున్నది వరుణ్ తేజ్ ని కాదట.. శేఖర్ కమ్ముల ఈ చిత్రం యొక్క కథ రాసుకుంటున్నప్పుడే ప్రేమమ్ తో మలయాళం లో సెన్సేషనల్ సృష్టించిన భామ సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయాడట. ఇక ఆ తర్వాత ఎవరు ఈ భామకి హీరోగా సెట్ అవుతారు అని హీరో కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన వేళ..

See also  Manchu brothers: మంచు బ్రదర్స్ మధ్య ఇన్ని రోజులు జరిగిన గొడవలన్నీ ఉత్తిత్తివే నట.?? మనందర్నీ బకరాలు చేశారు.! అసలు విషయం ఇదే..

do-you-know-what-is-the-blockbuster-movie-of-ram-charan-sai-pallavi-combination

మొదట శేఖర్ కమ్ముల సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు వెళ్లాడట.. అయితే శేఖర్ కమ్ములపై నమ్మకం లేక ఆయన రిజెక్ట్ చేయగా.. ఆ తర్వాత రామ్ చరణ్ వద్దకు వెళ్లి కథ వినిపించగా చరణ్ కు స్టోరీ బాగా నచ్చేసింది. కానీ డేట్స్ ఖాళీ లేనందువల్ల శేఖర్ కమ్ములని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఇటు ఫిదా కథను వదులుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో.. తన తమ్ముడు వరుణ్ తేజ్ తో ఫిధాను తీయమని శేఖర్ కమ్ములకు సూచన ఇచ్చాడు. దాంతో వరుణ్ ను పిలిచి స్టోరీ చెప్పడంతో అతనికి బాగా నచ్చడంతో వెంటనే ఫిదా చిత్రం పట్టాలెక్కేసింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ (Blockbuster movie) గా నిలవడంతో పాటు ఇటు వరుణ్ తేజ్ కి అటు సాయి పల్లవికి మంచి పేరు తీసుకువచ్చింది. అలా రామ్ చరణ్ సాయి పల్లవి కాంబోలో ఫిదా వంటి సూపర్ హిట్ చిత్రం మిస్ అయింది.