Bahubali – Dasara: ఏదైనా ఒక సినిమా హిట్ అయ్యింది అనగానే, ఆ సినిమా దర్శకుడికి హీరోకి వెంటనే క్రేజ్, నేమ్ వచ్చేస్తాయి.అలాగే సినిమా ఫెయిల్ అయినా కూడా వీళ్ళిద్దరికే డ్యామేజ్ ఎక్కువగా అవుతాది. నిజానికి ( Do you know this invisible force behind the hit Bahubali and Dasara? ) ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి దాని కోసం పనిచేసిన ఆ టీమ్ లో అందరి హ్యాండ్ ఎంతోకంత ఉంటాది. అలాగే బాహుబలి, దసరా లాంటి సినిమాలు హిట్ అవ్వడానికి కారకులు మనకి తెలిసిన వారు మాత్రమే కాకుండా ఎందరో ఉంటారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత హిట్ కొట్టిందో మనందరికి తెలుసు. ఇది తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో ముఖ్యంగా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఒక సినిమా వేరొక భాషలో హిట్ అవ్వాలంటే ముఖ్యంగా డబ్బింగ్ కుదరాలి. ఆ హీరో పర్సనాలిటీ బట్టి, హావభావాలను బట్టి డబ్బింగ్ కుదరాలి. లేకపోతే ఎంత గొప్ప సినిమా ( Do you know this invisible force behind the hit Bahubali and Dasara? ) అయినా కూడా ఆడియన్స్ నీ ఆకట్టుకోవడం చాలా కష్టం. అలా బాహుబలి సినిమా హిందీ లో అంత హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ కి డబ్బింగ్ అంత బాగా కుదరటమే.
ప్రభాస్ బాహుబలి సినిమా మొదట పాన్ ఇండియా సినిమాగా,అంత పెద్ద హిట్ కొట్టిన తరవాత ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా సినిమాలనే నిర్మిస్తున్నారు. బాహుబలి తరవాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో హిందీ లో హిట్ కొట్టలేదు. కారణం డబ్బింగ్ కుదరలేదు. అలాగే ఆ తరవాత వచ్చిన రాదేశ్యాం సినిమాకి హిందీలో డబ్బింగ్ స్వయంగా ప్రభాస్ నే చేపుకున్నడు. అయినా కూడా వర్క్ ఔట్ అవ్వలేదు.డబ్బింగ్ సరిగ్గా కుదిరి ఉంటే సినిమా హిట్ అయ్యే చాన్సు ఎక్కువగా ఉండును. బాహుబలి కి దసరాకి హిందీలో డబ్బింగ్ చెప్పింది ఒకే వ్యక్తి.
బాహుబలి, దసరా రెండు సినిమాలకి డబ్బింగ్ చెప్పి హిట్ చేసిన ఆ తెర వెనుక హీరో ఎవరంటే.. శరద్ కేల్కర్. ఇతను బాహుబలి రెండు పార్ట్స్ కి ప్రభాస్ కి తగ్గట్టు గంభీరమైన గొంతుతో డబ్బింగ్ ఇచ్చాడు. బాహుబలి సినిమా హిందీలో కూడా ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసినదే. అలాగే ఇప్పుడు ( Do you know this invisible force behind the hit Bahubali and Dasara? ) దసరా సినిమా కూడా హిందీ లో మంచి టాక్ తెచ్చుకుంది. దానికి కూడా ఈ తెర వెనుక హీరో చెయ్యి చాలా ఎక్కువుగా ఉన్నట్టు. అలా బాహుబలి , దశరా హిట్ వెనుక ఉన్న అదృశ్య శక్తి శరద్ కేల్కర్.