Bichagadu : కొన్ని సంఘటనలు కావాలని జరగకపోయినా, యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటాయి. జరిగిన వాటిలో ఇది ఈ టైంలో ఇలా జరిగింది, దానివల్లే జరిగింది, అందుకు జరిగింది, ఎందుకు జరిగింది? అంటూ ( Bichagadu and notes demonetization ) జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు 2000 రూపాయల నోట్లు రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసినదే. మే 19వ తేదీ 2000 రూపాయల నోట్లు రద్దు అని తెలియగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంటే ఇప్పుడు అందరి దగ్గర 2000 నోట్లు ఎక్కువ ఉండిపోయాయని కాదు.. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను సడన్గా రద్దు చేసింది గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
500 నోట్లు రద్దు అయిపోయినప్పుడు వాటిని మార్చుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరగడానికి ఆ బ్యాంకుల బయట జనాలు గంటలు గంటలు నిలబడి నానా కష్టాలు పడిన రోజులు ఒక్కసారిగా మళ్ళీ గుర్తొచ్చాయి. అయితే ఇప్పుడు 2000 రూపాయలకి ఎక్కువమంది అంత ఎక్కువ కష్టం పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఆర్బిఐ ఎప్పటినుంచో ₹2000 నోట్లని ముద్రించడం ఆపేయడమే కాకుండా 2000 రూపాయల ( Bichagadu and notes demonetization ) నోట్లు చలామణి అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చింది. అందువలన సడన్ గా ₹2000 నోట్లు రద్దు అన్నా కూడా సామాన్యులు ఎవరు పెద్దగా కష్టాలు పాలు కాలేదు. ఇదిలా ఉంటే 2000 రూపాయల నోటు రద్దు కి బిచ్చగాడు 2 సినిమాకి ఎలాంటి కనెక్షన్ ఉందో నేటిజెన్లు పెట్టే పోస్టులు చూస్తే నవ్వొస్తుంది.
విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా 2016 మే 13న రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఐదు నెలల్లో దేశంలో 500 రూపాయలు, వెయ్యి రూపాయలు నోట్లను రద్దు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ( Bichagadu and notes demonetization ) బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ అయితే.. సినిమా రిలీజ్ అయిన రోజునే 2000 రూపాయలు నోట్లను రద్దు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై సరదాగా కామెంట్లు మొదలు పెడుతూ దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. పాపం బిచ్చగాడు సినిమాకి మోడీ నోట్లు రద్దు చేయడానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. నెటిజనులు మాత్రం ఈ రెండింటికి బాగా లింకులు పెడుతున్నారు.
బిచ్చగాడు పార్ట్ వన్ వచ్చినప్పుడు 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయిపోతే.. బిచ్చగాడు పార్ట్ 2 వచ్చినప్పుడు 2000 రూపాయల నోట్ల రద్దు అయిపోయాయి. ఇక బిచ్చగాడు 3 రాకుండా చూసుకోండి రా బాబు అంటూ నెటిజనులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. బిచ్చగాడు 3 వస్తే ఇంకేమీ రద్దు చేస్తారు అంటారు? అని కామెంట్ చేస్తుంటే.. బిచ్చగాడు 3 వచ్చేలోపు కొత్త నోట్ ని కనిపెట్టి.. దాన్ని మళ్ళీ కరెక్ట్ గా బిచ్చగాడు 3 వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రెండు వేల రూపాయల నోట్లు రద్దుని.. బిచ్చగాడి మీద తోసేసినప్పటికీ.. ఈ రకంగా నైనా బిచ్చగాడు2 సినిమాకి బాగా ప్రమోషన్ జరుగుతుందని మరికొందరు అనుకుంటున్నారు.