Actor Ali: బీద కుటుంబంలో పుట్టిన అలీ ప్రస్తుతం కోటీశ్వరుడు నటననే నమ్ముకుని హీరోల కంటే ఎక్కువ సంపాదించాడు. బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి కమిడియన్ అయిన తరువాత హీరోగా అవకాశాలు అందివచ్చిన సినిమాలు చేస్తూ ప్రస్తుతం కొన్ని షోలకు హోస్ట్ గా ఉంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు అలీ. మొదట మిమిక్రీ కళాకారుడిగా, డాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు రాజమండ్రిలో గంటలమ్మ వీధిలో చిన్నపాకలో ఉండే అలీ పెద్దయ్యాక అక్కడినుంచి వేరే ప్రాంతానికి మారాడు.
ఇండస్ట్రీని నమ్ముకుని కోట్లు సంపాదించిన వాళ్లు ఉన్నారు బికారి అయిన వాళ్ళు ఉన్నారు అలా కోట్లు సంపాదించిన వారిలో ఆలీ ఒకడు. బ్రహ్మానందం తర్వాత అంతటి కమెడియన్ స్థానం ఎవరికైనా ఉందంటే అది అలిగారికే సొంతం. దాదాపు 1200 కు పైగా సినిమాల్లో నటించాడు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఒకవైపు సినిమాల్లో మరోవైపు టీవీ షోలలో బిజీబిజీగా సంపాదిస్తున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచార కార్యకర్తగా ఉన్నాడు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం అలికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా నియమించారు.
ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతూనే బుల్లితెరపై రియాల్టీ షోలు నిర్వహిస్తున్నాడు. కమెడియన్ గా కాకుండా వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తండ్రి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పాటు చేశారు దాంతో ఎంతో మంది పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఈ స్వచ్ఛంద సేవకు అవార్డు కూడా అందింది. ఈయన ఆస్తుల గురించి చెప్పాలంటే దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది సంవత్సరానికి 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రెండు కోట్ల విలువ చేసే ఇల్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈయన ఎక్కువగా భూములు కొనడానికి బాగా ఆసక్తి చూపిస్తాడట.