Baahubali: తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా మార్చిన గొప్ప సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన బాహుబలి ( Anushka’s role in the Baahubali movie ) సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలాంటి గొప్ప సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. అలాంటి బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర ఎంతో ముఖ్యమైనది.
బాహుబలి పార్ట్ వన్ 2015లో రిలీజ్ అవ్వగా, బాహుబలి పార్ట్ 2 2017 లో రిలీజ్ అయింది. ఈ రెండేళ్ల గ్యాప్లో ” వై కట్టప్ప కిల్డ్ బాహుబలి”? ఇదే.. ఇదే మాట ఎక్కడ విన్నా.. ఇదే ప్రశ్న ఎవరు అడిగినా? ఏ సినిమా వార్త చూసినా, ఇదే రెండు సంవత్సరాల పాటు ఒకే ప్రశ్నని ఒకరినొకరు అడుగుతూ దాని మీదే అనేక మీడియాలు ( Anushka’s role in the Baahubali movie ) వార్తలు రాస్తూ రాస్తూ వచ్చారు.. చివరికి బాహుబలి 2 రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించేవరకు. ఈ సినిమాలో అనుష్క.. దేవసేన అనే పేరుతో పాత్ర నటించింది. ఈమె ఈ సినిమాలో రెండు పాత్రలను పోషించినట్టు. ఒకటి ప్రభాస్ కి భార్యగా రెండు ప్రభాస్ కి తల్లిగా రెండు పాత్రలలోనూ చాలా ఉన్నతంగా నటించింది.
బాహుబలి మొదటి భాగంలో.. అనుష్క బానిసగా, అసలు గ్లామర్ అనేది లేకుండా డి గ్లామర్ గా కనిపిస్తుంది. అయినా కూడా సినిమాలో ఆమె కనిపించిన కొంతసేపు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుష్కని అలా చూసి అసలు ఆడియన్స్ ఒప్పుకుంటారా లేదా అని భయపడకుండా.. రాజమౌళి ఆలోచన విధానం, ఆయన( Anushka’s role in the Baahubali movie ) ధైర్యం చూసి నిజంగా మెచ్చుకోవచ్చు. ” పుల్లలు ఏరుకుంటున్నాను కదా అని పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? వాడి చితి కోసం కట్టెలు పేరుస్తున్నాను” అని రివేంజ్ తీర్చుకోవడం క్రమంలో ఆమె చెప్పిన డైలాగు ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేదు. ఆ పాత్రలో నటించిన అనుష్క.. రెండవ భాగంలో రాజకుమారిగా, బాహుబలికి భార్యగా కూడా అదరగొట్టింది.
అయితే బాహుబలి సినిమాలో అనుష్క చేసిన పాత్రకి మొదట రాజమౌళి.. అనుష్క ను అనుకోలేదంట. అందులో ఒక స్టార్ హీరోయిన్ ముందుగా అనుకున్నాడు అంట. ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్. దేవసేన లాంటి పాత్రకి ఐశ్వర్యారాయ్ లాంటి అందగత్తైతే బాగుంటుందని.. పాన్ ఇండియా సినిమా కనుక.. భారతదేశం మొత్తంలో క్రేజ్ ఉన్న హీరోయిన్గా ఆమెను పెడితే బాగుంటుందని.. బిజినెస్ పరంగా కూడా ఆలోచించే ఐశ్వర్యారాయ్ అని పెట్టాలని అనుకున్నాడంట రాజమౌళి. కానీ ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ ని కలవగా.. తన కూతురు ఆరాధ్య ను శ్రద్ధగా చూసుకునే బిజీలో ఉండటం వలన ఆ సినిమాకి ఆమె నో చెప్పేసింది అంట. ఐశ్వర్యారాయ్ నో చెప్పగానే.. రాజమౌళి ఇక ఏ హీరోయిన్ గురించి ఆలోచించకుండా.. వెంటనే అనుష్కని ఓకే చెప్పేసాడంట. ఐశ్వర్యారాయ్ అలాంటి సినిమాలో పాత్రను మిస్ అయిపోవడం నిజంగా బ్యాడ్ లక్ అని అందరూ అనుకుంటున్నారు.