Daggupati Family Has Such A Sentiment: దగ్గుపాటి ఫ్యామిలీ నీ మొదటిగా పరిచయం చేయాలంటే మీ అందరికీ దగ్గుబాటి ఫ్యామిలీ నుండి స్టార్ నిర్మాత అయిన రామానాయుడు గురించి చెప్పాలి. వీళ్ళందరి కంటే మొదటగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అడుగుపెట్టిన రామానాయుడు దాదాపు 100 పైగా సినిమాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకొని మూవీ మొగల్ గా బీరుదు తెచ్చుకున్నాడు. అలాంటి రామానాయుడు ద్వారా ఆయన కొడుకులు సినీ ఇండస్ట్రీకి వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఎంతో సక్సెస్ సాధించారు. దగ్గుపాటి రామానాయుడు గా లాగే పెద్ద కొడుకు సురేష్ బాబు కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుత సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ పేరు తెచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు.
అలా నిర్మాతగా అడుగు పెట్టినటువంటి రామానాయుడు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలను, యంగ్ డైరెక్టర్ లను తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం చేశాడు. అలా పరిచయమైన నిర్మాతలు ఆయన పెద్ద కొడుకు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఒకరు కాగా అలాగే రామానాయుడు చిన్న కొడుకు అయినటువంటి వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుత సీనియర్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ఇదే కాకుండా దగ్గుపాటి రామానాయుడు మనవాళ్లు రానా, అభిరామ్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.
ఇక రానా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించాడు హీరోగా అలాగే విధంగా విలన్ గా కూడా నటించి తన సత్తా ఎంతో నిరూపించుకున్నాడు. అలాగే అభిరాం కూడా ఇండస్ట్రీలో హీరోగా అహింస అనే సినిమాతో ప్రస్తుతం ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇదిలా ఉండగా కేవలం సినిమాల్లోనే కాకుండా విక్టరీ వెంకటేష్ అలాగే రానా వీళ్ళిద్దరూ కలిసి ఈ మధ్యకాలంలో రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో కలిసి నటించారు. అయితే ప్రస్తుతం మనం టాపిక్ విషయాన్నీకొస్తే.. తాజాగా దగ్గు దగ్గుపాటి ఫ్యామిలీ గురించి ఒక ఇంట్రెస్టింగ్, అలాగే షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే దగ్గుపాటి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఉన్న నటి నటులను పెళ్లి చేసుకుంటే అస్సలు కలిసి రాదట.. ఎందుకంటే అది మనందరికీ తెలుసు దగ్గుబాటి ఫ్యామిలీ నిజంగానే ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళను ఇంటి కోడలుగా ఆహ్వానించదంట. దానికి ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటంటే దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని అక్కినేని నాగార్జున వివాహం చేసుకొని ఒక కొడుకు పుట్టాక కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు ఆ విషయంలో అప్పటినుంచి (Daggupati Family Has Such A Sentiment) సినీ ఇండస్ట్రీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే తమ ఫ్యామిలీకి అస్సలు కలిసి రాదని భావించి దగ్గుపాటి ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం. లేదట ఈ విషయం తెలిసి చాలామంది నేటిజన్స్ వామ్మో దగ్గుపాటి ఫ్యామిలీకి ఇలాంటి సెంటిమెంట్ కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.