Home Cinema Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్...

Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..??

Samantha Earns From Instagram: సమంత గురించి ప్రత్యేకంగాపరిచయం చెయ్యాల్సిన పనేమీ లేదు. ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పెద్ద హీరోయిన్లలో మొదటి స్థానంలో తనే ఉంది. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తెలుగు ప్రేక్షకులందరికీ తన మాయలో పడేసుకుని ప్రస్తుతం తనే తెలుగు చిత్ర పరిశ్రమలో జెండా పాతేసింది. అలా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ సమంత ఎప్పుడు చూడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉండే అతి తక్కువ మంది నటీమణులలో తను ఒకరు ఈమె. అలా ఆమె జీవితం హ్యాపీగా, సాఫీగా సాగుతున్న తరుణంలో మయోసైటీస్ అనే వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.

do-you-know-how-much-samantha-earns-from-instagram-per-month

ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని మళ్ళీ కం బ్యాక్ ఇచ్చింది. సమంత మళ్ళీ షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీ బిజీగా ఉంటోంది. ఇటు సౌత్ లోనే కాకుండా ప్రస్తుతం నార్త్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది సమంత. ఇప్పటికే సమంత నటించిన చిత్రం శకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఆ సినిమా రిలీజ్ కావాల్సిన డేట్ కూడా అందరికీ తెలిసింది. ఏప్రిల్ నెలలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకు ముందు ప్రేక్షకుల ముందు రాబోతుంది. అలాగే తదుపరి చిత్రం రౌడీ భాయ్ విజయ్ దేవరకొండకు జోడీగా తెరకెక్కుతున్న చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా కూడా రాబోతుంది.

See also  Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఊహించని వార్త వెలుగులోకి!

do-you-know-how-much-samantha-earns-from-instagram-per-month

అలాగే మరోవైపు బాలీవుడ్ లో దర్శకత్వయం రాజ్ మరియు డీకే నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సిటాడల్ లాంటి వెబ్ సిరీస్ లలో వరుణ్ దావంతో కలిసి షూటింగ్ పనులు కూడా ప్రారంభించింది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా సమంత చేతిలో ఉన్నాయి. వాటితో సమంత ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది. ఇక సమంత రెమ్యూనరేషన్ విషయానికి వస్తే దాదాపు ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నట్టు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో రెమినేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా సమంతనే.. మరోవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంది. ఇక సమంత నెల ఇంస్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అందుకే మీకోసమే ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చాను..

See also  Actor In Tollywood: మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్ హీరో ఎవరో తెలుసా.?

do-you-know-how-much-samantha-earns-from-instagram-per-month

ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు (Samantha Earns From Instagram) లక్షల్లో కాదండి కోట్లలో సంపాదిస్తుంది సమంత. ఇంస్టాగ్రామ్ లో ఈ బ్యూటీ కి 24.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సమంత ఈ ఫాలోయింగ్ నే క్యాష్ గా చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సమంతకి పలు టాప్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. అలాగే అత్యంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాండ్లను తన సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తుంది. ఇలా ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేసి ఒక్క పోస్ట్ పెట్టిందంటే దాదాపు ఇరవై లక్షలు తీసుకుంటుంది అంట. అలా నెలకు సమంత ఇంస్టాగ్రామ్ ద్వారానే ఏకంగా మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల సైడ్ ఇన్కమ్ కూడా పెరిగిందని చెప్పాలి.