Director Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సుకుమార్.. మొదటి సినిమాతోనే తనలో ఉన్న సత్యాన్ని చాటాడు. ఆర్య సినిమా ( Director Sukumar wife Thabitha ) ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. తన సినిమాలో ఏదో ఒక లాజిక్కుని పట్టుకొని.. క్యాలిక్యులేషన్ తో ముందుకు తీసుకొని పోతాడు. ఆ లాజిక్ ని కనిపెట్టడం, ఆ లాజిక్ ని ఎంజాయ్ చేయడమే ప్రేక్షకుడి ఆనందం. ప్రేమ పుచ్చుకునే వాడికి అంత డిమాండ్ ఉంటే.. ఇచ్చేవాడు ఇంకెంత గొప్ప అంటూ ఆర్య సినిమాలో ఆయన నినాదం అప్పట్లో అదిరింది. అలాగే 100% లవ్ స్టోరీ సినిమా ఒక సూపర్ ట్రెండ్.
బాగా చదువుకునే వాడి పైన కూడా అంత కామెడీగా.. చదువుకునే వాడితో ఉండే సమస్య.. లవ్ లో ఇగో ఫీలింగ్స్ గురించి, బావ మరదళ్ల ప్రేమని ఆయన తీసిన విధానం అప్పటి ట్రెండును బట్టి.. చదువులో పోటీ విధానాన్ని తీసిన విధానం నిజంగా గొప్పతనం. అలా సుకుమార్ సినిమాల్లో నాన్నకు ప్రేమతో.. ఈ సినిమా ఎంత అద్భుతంగా, ఎంత ( Director Sukumar wife Thabitha ) లాజికల్ గా తీశాడో చెప్పుకోనక్కర్లేదు. తెలివైన వాడి కంటే తెలివైనవాడు అంటూ ఎన్టీఆర్ తో ఆయన చేయించిన నటన నిజంగా గ్రేట్. ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎంత గొప్ప నటన నటించగలడో ఆయన చూపించాడు. ఆయన ప్రతి సినిమాలో హీరో ఎంతో కొంత డిఫరెంట్ గా ఉండే దాన్ని ఆడియన్స్ తో మెప్పించి, ఒప్పించగలిగే గొప్ప దర్శకుడు సుకుమార్.
సుకుమార్ దర్శకుడుగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో ఆనందంగా హాయిగా బ్రతికే ఒక సామాన్యమైన మనిషిలా ఉంటాడు. ఆయన భార్య వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లెక్కలు మాస్టార్ కి సరైన భార్య అంటూ అందరూ పొగుడుతున్నారు. సాధారణంగా ( Director Sukumar wife Thabitha ) పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే ఎవరైనా కూడా ఏదో ఒక మంచి కోట్ తో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. కానీ సుకుమార్ భార్య తబిత పోస్టులో ఏం పెట్టారంటే.. 14 సంవత్సరాల తబితా సుకుమార్ వైవాహిక జీవితం ఈక్వల్ టు 730 వారాల ఆనందం.. 5113 రోజుల విధేయత.. 122721 గంటల అవగాహన.. 7363288పట్టుదల..
441797328 సెకండ్ల నిరంతర నిబద్ధత అని చెప్పారు. 14 సంవత్సరాల వైవాహ జీవితాన్ని ఆమె సింపుల్గా ఈ విధంగా వెల్లడించారు. లెక్కల మాస్టారికి సరైన లెక్కలతో.. లాజికల్ బ్రెయిన్ కి సరైన లాజిక్ తో మంచి బ్రెయిన్ తో సుకుమారు వైవాహిక జీవితాన్ని సుకుమారికి లెక్కలేసి మరి మొత్తం పబ్లిక్ గా అందరికీ తెలిసేలా ఆమె చెప్పడం.. నిజంగా ఆమెకి ఆయన మీద ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇక సుకుమార్ అభిమానులైతే.. లెక్కలు మాస్టారు ఇంకా మా వదినమ్మ కూడా తగ్గేదేలే అని తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ జంట ఇలాగే ఆనందంగా అనేక పెళ్లి రోజులు చేసుకోవాలని నెటిజనులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా కచింతంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తాదని అభిమానుల నమ్మకం.