Sukumar – Baby : ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ సెకండ్ హీరోగా, సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ చిత్రం ఇప్పుడు సినీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడికో వెళ్తున్నాయి. రోజురోజుకీ ఈ సినిమాపై పాజిటివ్ థింకింగ్ పెరిగిపోతోంది. యూత్ ( Sukumar Review of Baby Movie ) అయితే ఈ సినిమా కోసం పడిచస్తున్నారు. కాలేజీ పిల్లలందరూ కాలేజీలు ఎగ్గొట్టి మరి ఈ సినిమాకి వెళ్తున్నారు. ఇక పిల్లలు ఎంత క్రేజీగా చూస్తున్న ఈ సినిమా.. అసలు ఎలా ఉందో అని పెద్ద వాళ్ళు కూడా వదలకుండా చూస్తున్నారు. ప్రతి వయసు వాళ్ళు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యి.. వాళ్ళ వయసుని, వాళ్ళ రియల్ లైఫ్ లో సంఘటనలని గుర్తు తెచ్చుకుంటున్నారు.
బేబీ సినిమా సక్సెస్ అవ్వగానే ఎందరో సెలబ్రిటీలు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆ చిత్ర బృందానికి అనేకమంది శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. ఈ సినిమా గురించి మళ్లీ ఒక రివ్యూ ఇచ్చాడు మన లాజిక్ మాస్టారు సుకుమార్. సుకుమార్ దేన్నైనా చేశాడు అంటే.. దాన్ని చాలా లెక్క ప్రకారం, లాజిక్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. ఆయన ( Sukumar Review of Baby Movie ) దర్శకత్వం వహించే సినిమా గాని, ఆయన దగ్గర పనిచేసే ఆయన అసిస్టెంట్ గాని, దర్శకులైన గాని దానిమీద ఆయనెప్పుడైనా శ్రద్ధ పెడితే ఎంతో లాజిక్ చెప్తారు. అలాగే ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి.. ఆయన శిష్యుడు చేసినప్పటికీ కూడా.. ఆయన కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ చెప్పడం వలన ఆ సినిమా అంత హిట్టు కొట్టిందని ఆయన శిష్యుడు చెప్పుకోవడం కూడా జరిగింది.
అలాగే ఇప్పుడు సుకుమార్.. బేబీ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. సుకుమార్ బేబీ రివ్యూ గురించి సోషల్ మీడియాలో ఇలా చెప్పుకొచ్చారు.. చాలా కాలం తర్వాత ఒక అసాధారణమైన రచన చూశాను. అలాగే ఈ సినిమా కొత్త ఒరవడిని పందాలు తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. మొదటిసారిగా నేను ( Sukumar Review of Baby Movie ) ఒక సినిమాలో సిచ్యువేషన్ కూడా పాత్రల తరహాలో చూశాను. ఈ సినిమాలో సాయి రాజేష్ కి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతవరకు ఈ సినిమాని చూసినవారు, పొగిడినవారు లేదా నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా సుకుమార్ పందాలో ఆలోచించలేదు. ఈ సినిమా ఇప్పుడు జనరేషన్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందని, రియల్ గా జరిగే చాలా సీన్స్ ని అందులో చూస్తున్నట్టు ఉందని ఎందరో చెప్పారు.
కానీ సుకుమార్ మాత్రం ప్రతి సీన్ ని ఒక థ్రిల్లర్లా చూస్తున్నట్టు ఉంది అని అనడం నిజంగా ఆయన లాజిక్ నిజమే అనిపిస్తుంది. నిజమే ఈ సినిమాలో ఎప్పుడు ఏ సీను ఎలా తిరుగుతుందో.. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఏం జరుగుతుందో అనేది థ్రిల్లింగానే గానే అనిపిస్తాది. ఏది మనం ఊహించినట్టు జరగదు. వాస్తవాలనే సినిమా తీసినట్టు అనిపించినా కూడా.. వాస్తవ జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనం ఏం చేయబోతున్నాం, మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది ఊహించొచ్చు.. కానీ ఈ సినిమాలో ఊహించలేకపోయాం. మొత్తానికి సుకుమార్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.