Sukumar Profits Virupaksha: జగడం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకుడు సుకుమార్, తన మొద్దటి సినిమాతో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకుల మన్నలను పొంది తనకు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులని మెప్పించారు. సుకుమార్ దర్శకత్వంతో పాటు తన సొంత బ్యానర్ “సుకుమార్ రైటింగ్స్” అనే పేరుతో సినిమాలు నిర్మిస్తున్నాడు.
కుమారి 21f , ఉప్పెన, దసరా, విరూపాక్ష అయన నిర్మించిన సినిమాలు. ఈ సినిమాలు అని బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టి తనకు బోలెడంత సంపద తెచ్చి పెట్టాయి. ఈ మధ్య కాలంలో అయన కింద పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కొందరు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. బుచ్చి బాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వంద కోట్లు సంపాదించినా మొద్దటి చిత్రం. ఆ తరువాత సుకుమార్ మరో శిశుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయింది.
ఇపుడు విరూపాక్ష కూడా హిట్ కొట్టి సుకుమార్ కు బోలెడంత ధనాన్ని సంపాందించింది. అయితే విరూపాక్ష సినిమాలో అయన డబ్బు ఒక్కరూపాయి కూడా పెట్టకుండా తనకి ఐదు కోట్ల లాభం వచ్చిందట. దర్శకుడు సుకుమార్ పై ఈ మధ్య ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగింది. అయన వరుసగా సినిమాలు నిర్మించడమే రైడ్స్ కు కారణం అని ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే, ప్రేక్షకులు ఎంతో వేచి చూస్తున పుష్ప – ది రూల్ మొద్దటి టీజర్ “వేర్ ఈజ్ పుష్ప” అనే టాగ్ లైన్ తో విడుదల చేసారు, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా కోసం యావత్ భారతదేశ సినీ ప్రేమికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పుష్ప రెండో భాగం తరువాత సుకుమార్ (Sukumar Profits Virupaksha) రామ్ చరణ్ తో మరోసారి కలిసి పని చేయనున్నారని న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి సంబందించిన ఆధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఏది ఏమైనా సుకుమార్ ఇలాగే ఎనో మంచి సియమాలు తీసి మరియు నిర్మించి మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము.