Home Cinema SS Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది.. మొత్తం 10 భాగాలు..

SS Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది.. మొత్తం 10 భాగాలు..

SS Rajamouli Dream Project: డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్బస్టర్ గా నిలిచాయి. మన టాలీవుడ్ దర్శకుడు అయినా రాజమౌళి సినీ కెరీర్ లో ఒక ప్లాప్ కూడా లేదు. ఇది ఆయన గుర్తింపు. తాను తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టాయి. రాజమౌళి దర్శకత్వం వహించిని లేటెస్ట్ సినిమా RRR లో ఉత్తమ పాటకు గాను ఆస్కార్ వచ్చింది. కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అమెరికాకు వెళ్లి ఆస్కార్ అందుకున్నారు.

See also  Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ ని అందరూ వాడుకున్నారంటూ పచ్చి నిజాలు బయటపెట్టిన దర్శకుడు..

SS-Rajamouli-Dream-Project

ఇది భారతీయ సినీ చరిత్రలోనే మొదటిసారి. ఇలానే రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బాహుబలి తరువాత వచ్చిన RRR భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించారు. అయితే, అసలు విషయానికి వస్తే రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆసక్తి కార వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా తీస్తే ఎంతలేదన్నా పది భాగాలుగా తీస్తాను అని అన్నారు.

See also  Prabhas - Sai Pallavi: బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రాన్ని సాయి పల్లవి తో కలిసి నటించకుండా మిస్ చేసుకున్న ప్రభాస్..

SS-Rajamouli-Dream-Project

అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ పది భాగాలుగా ప్రేక్షకులు ముందుకు వస్తాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీని కోసం మహేష్ తన లుక్ ను మార్చదు మరియు వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక RRR రెండో భాగం తీసేందుకు చిత్ర యూనిట్ రెడీ గా ఉందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి ఏ సినిమా తీసిన రెండు మూడు సంవస్త్రాలు తీస్తాడు. ఇలా ఆయన మహాభారతం ఎలా పూర్తిచేస్తానో లేదో అని కూడా మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

See also  Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

SS-Rajamouli-Dream-Project

సినిమా అభిమానులు మాత్రం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. రాజమౌళి తాను తీసే సినిమాలతో పాన్ ఇండియా ఫేమ్ ను అందుకున్నాడు. ఇలానే ఆయన రాబోయే చిత్రాలు కూడా బాగా ఆడి టాలీవుడ్ ఇండస్ట్రీ కి మంచి పేరు తెచ్చిపెట్టాలి. రాజమౌళి ని ఎందరో స్ఫూర్తిగా తీసుకొని దర్శకులుగా కూడా మారారు. ఇలాగె అతను మహాభారతం తీసి అందరిని మంత్రముగ్ధుడిగా చేయాలనీ కోరుకుంటునమూ. (SS Rajamouli Dream Project)