Home Cinema Director Krish: పెళ్ళైన ఒక్క ఏడాదికే డివోర్స్.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం..

Director Krish: పెళ్ళైన ఒక్క ఏడాదికే డివోర్స్.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం..

Director Krish Divorce: టాలీవుడ్ లో విభిన్నమైన టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకులలో ఒకడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ. ఈయన తీసిన సినిమాలు హిట్ లేదా ఫ్లాప్ అనే విషయాన్నీ పక్కన పెడితే, క్లాసిక్స్ గా నిలిచిపోయినవి చాలా ఎక్కువ. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శాతకర్ణి ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలు ఈయన దర్శకత్వం లో తెరకెక్కాయి. అందుకే అతి తక్కువ సమయం లోనే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన సత్తాని చాటిన క్రిష్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ లాంటి చిత్రాన్ని చేస్తున్నాడు.

See also  Aadikeshava Trailer Review : ఆదికేశవ ట్రైలర్ రివ్యూ..

krish-divorce

ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ సినిమా ఆగస్టు నుండి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం క్లైమాక్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ప్రొఫెషనల్ జీవితం గురించి అందరికీ తెలిసిందే కానీ, వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక అసలు విషయానికి వస్తే క్రిష్ 2016 వ సంవత్సరం ఆగష్టు 7 వ తారీఖున రమ్య వెలగ అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్లిద్దరి పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో వీళ్లిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

director-krish-divorce

అయితే ఇప్పుడు క్రిష్ తన భార్య కలిసి ఉండడం లేదు. పెళ్ళైన ఏడాదికే రమ్య క్రిష్ నుండి విడాకులు తీసుకుంది(Director Krish Divorce). వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం క్రిష్ ఒక స్టార్ హీరోయిన్ తో రహస్యం గా రిలేషన్ ని కొనసాగించడం వల్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగే చర్చ. ఈ విషయం పెళ్ళైన కొత్తల్లోనే తెలుసుకుంది రమ్య. షూటింగ్స్ పేరుతో ఎప్పుడు ఆయన బయటే తిరుగుతూ ఉండేవాడట. ఇంటికి అసలు వచ్చేవాడే కాదట. అయితే ఒకరోజు ఇతని సంగతి ఏంటో తెలుసుకుందామని ముంబై లో ఒక హోటల్ లో ఉన్నాడని తెలిసి, రహస్యం గా అక్కడికి చేరుకుంది.

See also  Rashmika - Diwali : కాబోయే అత్తారింట్లో దీపావళి సీక్రెట్ గా జరుపుకున్న రష్మిక..

Director-Krish

హోటల్ రూమ్ లోపలకు వెళ్లి చూడగా క్రిష్ ఆ స్టార్ హీరోయిన్ కలిసి ఉండడాన్ని చూసి ఆమెకి గుండెలు ఆగినంత పని అయ్యిందట. వెంటనే విడాకులకు అప్లై చేసింది. విచారణ జరిపిన కోర్టు 2018 వ సంవత్సరం లో విడాకులు మంజూరు చేసింది. ఎప్పుడైతే ఆమె తో విడిపోయాడో అప్పటి నుండి క్రిష్ కి కెరీర్ పరంగా గడ్డు కాలం ఎదురైంది, చేసిన ప్రతీ సినిమా బోల్తా కొట్టేసింది. క్రిష్ ప్రస్తుతం హరి హర వీర మల్లు అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి హీరోగా పవన్ కళ్యాణ్ చేయనున్నాడు. కాస్టింగ్ మొత్తం ఫిక్స్ అయినా ఈ సినిమా ఏవో తెలియని కారణాల వల్ల బ్రేక్ పడింది.